తన కోపమే తన శత్రువు.. ఈ మాట ఎప్పుడు చెప్తారో అందరికి తెలుసు. ఎందుకు చెప్తారో కూడా తెలుసు. ఈ మంచిమాటను మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం. ఈ మాటకు అంత పవర్ ఉంది మరి. నిజమే మరి.. తన కోపమే తన శత్రువు. కోపం ఎవరైనా సరే తగ్గించుకోవాలి. లేదంటే ఆ కోపం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే.. కోపంలో మనం ఎం చేస్తామో మనకే తెలియదు. 

 

ఆ కోపంలో తీసుకునే ఆవేశపు నిర్ణయాలు జీవితాలను సర్వనాశనం చేస్తాయి. ఒకొక్కసారి అది నిజం అవుతుంది. ఆ నిర్ణయాలు చాల దారుణంగా ఉంటాయి కూడా. కొన్నికొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాల కారణంగా మనం ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది అని మనకు ముందే తెలుస్తుంది. కానీ కొన్ని కొన్నిసార్లు పంతంతో కోపంలో నిర్ణయాలు తీసుకొని మనలని మనమే నాశనం చేసుకుంటాం. 

 

'తన కోపమే తన శత్రువు' అని పెద్దలు చెప్పిన మాట ఇది అక్షర సత్యం. కోపంతో శత్రువులను పెంచుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. క్షణికావేశం అంతులేని అనర్థాలకు దారితీస్తుంది. నిరర్థకమైన ఆగ్రహం నుంచి విముక్తి కోసం ప్రయత్నించాలి. తన శాంతమే తనకు రక్ష అనే సూక్తిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆచరించాలి.  అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: