ఈ కాలంలో వాళ్ళది వాళ్ళు చూసుకోవడం కంటే పక్కన వాళ్లదే ఎక్కువ చూస్తారు ఈ కాలం ప్రజలు.  అందుకే పక్కన వారు ఎప్పుడు వాళ్ళ పని వాళ్లు చూసుకోకుండా నీ జోలికి వచ్చి ఏం చేసావ్ రా నాయనా ఇలా చేస్తావ్ ఏంట్రా నీకు అసలు చేతన అవుతుందా అవ్వదా ఏంటి ఈ పరిస్థితి అంటూ  హేళన  చేస్తారు అందుకే అలాంటి సమయంలో గ్రహించకుండా శాంతంగా తీసుకుని నా కోసం ఒకరు ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని అనుకున్నావ్ అనుకో నీకు ఎంతో మంచి జరుగుతుంది. 

 

ఎందుకు మంచి జరుగుతుందో తెలుసా... వారు నాకు చేత కాదు అన్నప్పుడు ఇంకా ఇంకా చేయాలి అనే భావన నీలో మొదలవుతుంది. వారు ఎంత కించపరిస్తే నువ్వు అంత ఎదుగుతావు. ఇదే నిజం. ఈ సామెతను నేను చూసిన ఉదాహరణ మీ కోసం.. ఒకానొక సమయంలో ఒక అమ్మాయి ఏమి చేయలేదు అని..  ఏమి రాదు అని చెప్పేసి ఒక పెళ్లి చేయమని వాళ్ళ అమ్మకు చెప్పింది. కానీ ఆ అమ్మాయి ఒక శక్తిగా ఎదిగింది.. ఎలా అంటే ఆమె చేసిన పని అంత గొప్పది. ఆమె భావనలను ఒక వ్యాసంలో రాస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని... ఎవరైతే ఆమెను కించ పరిచారో వారి దగ్గరికి వెళ్లి ఈరోజు చెప్పు నా చేత కాదంటావా? అని అడిగారు. నిజం చెప్పండి ఆ ఫీల్ ఎంత అందంగా ఉంటది.. ఎంత అద్భుతంగా ఉంటుంది.

 

అందుకే ఎవరైనా మనల్ని కించపరిచేలా గా మాట్లాడారు అంటే మన వల్ల ఏమీ కాదు అని చెప్పారంటే అది ఖచ్చితంగా అది మన వల్ల అవుతుంది అని అర్థం. మొగ్గలోనే తుంచి చేయాలి అని ఆలోచించి ఆ మాటలు మాట్లాడుతారు. మనం పట్టించుకుంటే జీవితంలో ఎదగడం చాలా కష్టం ఆ మాటలను సీరియస్ గా తీసుకోకండి. వాళ్లు కాదు అనేది కచ్చితంగా మన వల్ల అవుతుంది అని అర్థం ఆ మాటలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం ఇది అర్థం చేసుకుని మార్చుకోండి. మీ జీవితం ఎంతో అందంగా మారుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: