లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం ఉండాలి ఈ మంచిమాట ఎవరు చెప్పారో తెలుసా ? స్వామి వివేకానంద చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే.. ఈ తరం యువత లక్ష్యాన్ని ఛేదించటానికి ముందుకు వెళ్ళటం లేదు కనుక.. అసలు జీవితం అంటేనే సీరియస్ లేదు కనుక.. వారికీ లక్ష్యం అంటే ఏంటో కూడా తెలీదు కనుక.. 

 

సరే ఇంకా అసలు జీవితంలోకి వెళదాం.. ఈ కాలం యువతకు గౌరవం లేదు.. పక్కవారికి మర్యాద ఎలా ఇవ్వాలో అంతకన్నా తెలియదు.. ఒక లక్ష్యం లేదు కష్టం లేదు.. ఏదో బతకాలంటే బతకాలి.. చదవాలంటే చదవాలి అన్నట్టు ఉంది యువత జీవితం. ఒకవేళ ఇంతమందిలో ఎవరైనా ఒక ఆణిముత్యం ఉంటె.. ఆ ఆణిముత్యం జీవితం ఆశ్చర్యకరం. 

 

ఆ ఆణిముత్యం కూడా లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఒక్కసారి అది కుదరకపోతే.. ఇంకా అది అస్సలు అవ్వదు ఏమో అనే ఆలోచనలో పడిపోతారు. కానీ ఆలా నిరాశ చెందకూడదు.. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం అన్ని ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని ఛేదించగల్గుతాం.. చరిత్రకు ఎక్కగల్గుతాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: