కలిసుంటే కలదు సుఖం.. కమ్మని సంసారం అంటూ పాటలు వినే ఉంటాము.. అలాంటి పాటలు ఉన్న అవి జీవిత సత్యాలు. ఐకమత్యమే మహా భాగ్యం అని మన పెద్దలు చెప్పే ఉంటారు. అవును నిజమే.. మన పెద్దలు చెప్పినట్టు కలిసి ఉంటె కలదు సుఖం.. అలానే అందరం ఐకమత్యంగా ఉంటె ఎన్నో పనులు చెయ్యచ్చు.. కలిసి ఉంటె మన శత్రువులను సైతం తరిమి తరిమి కొట్టచ్చు. 

 

ఐక్యంగా ఉంటె ఎంతటిదానినైన సాధించచ్చు. అందరం కలిసి ఉన్నప్పుడు వేరు.. ఎవరు లేనప్పుడు వేరు.  అందరూ కలిసి ఉన్నారంటే ప్రేమ, అనురాగం ఇలా అన్ని దక్కుతాయి. అదే ఒంటరిగా ఉంటె.. ఏ సంతోషము దక్కకపోగా ఒంటరి అయిపోతాము. అందుకే అందరూ కలిసి ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. ఈ ఐకమత్యమే మహా బాగ్యం సామెతకు మీ కోసం ఓ ఉదాహరణ. 

 

ఒక అడవిలో అన్ని జంతువులు జీవిస్తూ ఉండేవి. అయితే అక్కడ అడవికి రాజు సింహం కూడా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఓ సింహం వేటకు వెళ్తుంది. అయితే అక్కడ ఆవులు అన్ని కలిసి ఉంటాయి. అందుకు ఒక్క అవుపై కూడా దాడి చెయ్యలేకపోయింది. అయితే ఒక రోజు మాత్రం ఆవులు అన్ని మేత కోసం విడిపోయాయి. దీంతో ఇదే అదునుగా చూసుకున్న సింహం ఒకొక్క దానిపై దాడి చేసి చంపి తినింది. 

 

చూశారా! ఆ ఆవులు కలిసి ఉన్నంతకాలం అడవికి రాజైన సింహం కూడా వాటిని ఏమి చేయలేక.. ఒంటరిగా ఉన్నసమయంలో సంహరించగలిగింది. అందుకే మన పెద్దవారు ఐకమత్యమే మహాబలం అని చెప్పేది. కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలూ వస్తే మన సంఘటితంగా ఎదుర్కోగలం. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: