పరిస్థితులు ఎలా ఉన్న నువ్వు నీలా ఉండటమే నీ బలం.. కానీ మన జీవితంలో ఆ బలం ఉండదు. ఎందుకంటే.. మనకు వచ్చే సమస్యలు మనల్ని కుదిపేస్తాయి. మనం బతకలేం అన్నట్టు చేసేస్తాయి. మన ఆర్ధిక పరిస్థితి మన నోరును మూపిస్తుంది. ఇప్పుడు పైన చెప్పను కదా.. ఒక మంచి మాట. ఆ మాట కేవలం డబ్బు ఉన్నవారికి మాత్రమే పనికి వస్తుంది.. 

 

ఎందుకంటే.. డబ్బు ఎంత మనిషిని అయినా.. ఎంత మంచివాడిని అయినా.. ఎంత పొగరుబొతునైనా వంచేస్తుంది. పరిస్థితులు ఆలా వస్తాయి.. మనం సినిమాలో చూస్తాం.. మంచివాడు.. నలుగురికి సేవ చేసినవాడు ఎప్పుడు తలా వంచాడు అని. కానీ ఆలా సహాయం చేశారు అంటేనే.. పరిస్థితులు బట్టి మారడం. అందరూ అర్థం చేసుకోండి.. పరిస్థితులు ఎలా ఉన్న నువ్వు నీలా ఉండటమే నీ బలం అని కాదు.. పరిస్థితీ ఎలా ఉన్న మంచిగా పరిస్థితికి అనుకూలంగా మరి సమస్యను పెద్దది చెయ్యకుండా చూసుకోవాలి. 

 

ఇప్పుడు ఒక ఉదాహరణ.. పట్టణానికి పరిస్థితి కొసం వచ్చేవారు.. ఎంతోమంది.. కుటుంబాలను వదిలేసి.. పట్టణానికి వచ్చి ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని.. రాత్రనక.. పగలనక పని చేసిన.. నెల గడిచిన జీతాలు రాకపోతే.. ప్రశ్నిస్తే.. బయటకు పోతే మనకు వచ్చే జీతం రాదు ఏమో అనే భయంతో.. నోరు మెదపకుండా అలాగే ఆ జీతం ఇవ్వని నీచుల కోసం పని చేసే బతుకు ఎందుకు ? ఇలాంటి జీవితం మనం బతుకుతే ఎంత.. చస్తే ఎంత? కేవలం ఒక డబ్బే జీవితాన్నీ ఇలా తారుమారు చేస్తుంది. అందుకే స్వయం కృషితో పని చెయ్యండి.. ఎదగండి. డబ్బుని బాగా సంపాదించాకా.. ఏలాంటి పరిస్థితి వచ్చిన మీరు మీలా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: