నేటి మంచిమాట..  ప్రేమ స్వాదినంను కోరుకోదు కానీ స్వేచ్ఛను ఇస్తుంది .. అదేంటి అండి.. అప్పట్లో సామెతలు అన్ని ఇప్పటికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక్క సామెత.. ఒక్క మంచిమాట కూడా ఈతరం వారికీ సెట్ అయ్యేవి లేవు ఏంటో ఏమో.. కాలం మారింది.. జీవన విధానం మారింది. కాబట్టి సామెతలు కూడా మారాల్సిన సమయం వచ్చేసింది. 

 

ఇంకా ఈ కాలం గురించి పక్కన పెట్టి మన సామెతల విషయానికి వస్తే... అవును.. ఒకప్పుడు ప్రేమ అంటే స్వేచ్ఛను ఇచ్చేది.. ఎందుకంటే నమ్మకం ఉండేది కాబట్టి.. కానీ ఇప్పుడు నమ్మకం లేదు. ఎందుకంటే? ప్రేమించిన అమ్మాయి మనతో నమ్మకంగా ఉన్న ఆ అమ్మాయి మాట్లాడే అబ్బాయిలు ఎంత ఎదవలో తెలియదు కాబట్టి. 

 

అయితే అప్పట్లో మాత్రం ఆలా కాదు.. ఒక్కసారి ప్రేమిస్తే.. వారు వారి సొంతం అయ్యేవాళ్ళు.. కానీ ఆలా ప్రవర్తించేవారు కాదు.. స్వేచ్ఛను ఇచ్చేవారు.. మంచితనాన్ని ఇచ్చేవారు.. అందుకే అప్పటి ప్రేమలు చాలా బలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రేమలు ఆలా కాదు.. ఒక్కసారి ప్రేమించారో ఖతం. ఆ అమ్మాయి తల్లితండ్రులు కూడా ఎవరో... ప్రేమించిన అబ్బాయికి మాత్రమే సొంతం ఆ అమ్మాయి. ఇంకా ఎవరితో మాట్లాడకూడదు.. ఎక్కడికి వెళ్ళకూడదు.. వెళ్లాలన్న అతను రావాలి.. అబ్బబ్బా వద్దులే.. అనుమానమా? అని అడిగాము అంటే.. నిన్ను అనుమానిస్తానా బేబీ అని తొక్కలో ఓ డైలాగ్... ప్రేమించిన ప్రతి అమ్మాయి పరిస్థితి ఇదే. అబ్బాయిలు ఇది చదివింటే అర్థం చేసుకోండి. ప్రేమ స్వాదినంను కోరుకోదు కానీ స్వేచ్ఛను ఇస్తుంది అని.. 

మరింత సమాచారం తెలుసుకోండి: