నేటి మంచి మాట.. జీవితంలో ఏది కోల్పోయినా.. ఎక్కువగా బాధపడకు. అవును.. ఏది కోల్పోయిన ఎక్కువ బాధపడకూడదు. ఎందుకంటే? మనం అలా భాద పడ్డాము అంటే ? మన జీవితం అక్కడే ఆగిపోతుంది. అలా కాదు అని మన పని మనం చేసుకుంటూ వెళ్తే.. అంతకంటే గొప్ప అవకాశం మనకు రావచ్చు.. 

 

అవును.. మనం అనుకుంటాం.. అది రావాలి.. ఇది రావాలి అని.. అందు కోసం మనం కష్టపడుతాం కూడా.. కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ మనం అనుకున్నది మనకు సొంతం అవ్వదు. అవును దాని వల్ల మనం బాధ పడుతాం. ఆలా అని కోల్పయిన దాని గురించి బాధ పడుతూ కూర్చుంటే మనం ఇంకేం సాధించగలం. 

 

మనం ఎం కోల్పోయిన సాధించగలం.. ఒక్క కాలాన్ని తప్ప. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అలోచించి తీసుకుంటే మంచిది. కోల్పోయిన వాటి గురించి ఆలోచించి ఉన్న వాటిని కోల్పోకండి.. అప్పుడే ఇంకేమైనా సాధించగలం.. ఒకటి కోల్పోయాము అంటే అంతకు మించిన దాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: