నేటి మంచిమాట.. ''ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశాంతి''. అవును.. మనిషి ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశాంతిగా ఉంటాడు.. అది మనిషిని అయినా వస్తువును అయినా జంతువును అయినా.. ఎందుకంటే ఈ కాలంలో ఏది శాశ్వతం కాదు.. మనం ముందు అమితంగా ప్రేమించి.. అది దూరం అయినప్పుడు బాధపడటం కంటే అతిగా ప్రేమించకుండా ఉండటం మంచిది. 

 

ఈ వ్యాఖ్యానికి ఒక ఉదాహరణ.. మీరు ఒక కుక్కను తెచ్చుకుంటారు.. ప్రేమతోనే తెచ్చుకుంటారు.. దాన్ని బాగా పెంచుతారు.. ఉదయం సాయింత్రం.. పడుకునే ముందు దానితో ఒక్కసారైనా ఆడుకున్న తర్వాతే మీరు పడుకుంటారు.. అలా దానిపై రోజు రోజుకు మీకు ఎఫక్షన్ పెరిగిపోతుంది. అలా పెరిగిన సమయంలో సరిగ్గా కుక్కకు ఏమైనా అవుతుంది ఏమో అని భయపడుతారు. 

 

దాన్ని వదిలి ఒక్క రోజు బయటకు వెళ్ళాలి అన్న కూడా ఆ కుక్కకు ఎం అవుతుందో అని భయపడుతూనే వెళ్తారు.. అందుకే అతి ప్రేమ ఎప్పుడైనా అనర్ధమే! అతి ప్రేమ అనేది ఒక కుక్కపైన అనే కాదు.. ఏదైనా సరే.. మీ అతి ప్రేమ మరొకరిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: