నేటి మంచిమాట.. వెలిగే దీపంలా ఉండు.. అప్పుడే ఇతరులకు వెలుగును ఇవ్వగలవు. అవును నువ్వు బాగుంటేనే కదా ఇతరులకు వెలుగును సహాయం చేయగలవు.. నువ్వే బాధపడుతూ.. ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఉంటె ఇతరులకు ఎం సాయం చేయగలవు.. ఇతరులకు సపోర్ట్ ఎం ఇస్తావు ?

 

అందుకే కష్టపడు.. కష్టపడి పైకిరా.. ఇతరులకు సాయం చెయ్యి.. అవును.. కొందరు ఉంటారు.. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తోడు ఉండకుండా.. వారికీ కష్టాలు వచ్చినప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తారు.. స్వార్థపరులు అని. అలాంటి సమయంలో అవసరానికి వాడుకుంటారు అని అనుకోకుండా.. వారు చీకటిలో ఉన్నప్పుడు వెలుగులా నువ్ కనిపిస్తావు అనుకోని సాయం చెయ్యండి. 

 

నువ్వు వెలిగే దీపంలా ఉంటె.. ఇతరులకు వెలుగును ఇవ్వగలవు.. స్వార్దాన్ని వదిలి సాయం చెయ్యడం నేర్చుకో.. సహాయం చేసినప్పుడు వచ్చే తృప్తి మారే పనిలోను ఉండదు అనేది తెలుసుకో.. జీవితం అద్భుతంగా.. ఆనందంగా ఉంటుంది. వెలిగే దీపంలా ఉండి.. చీకటిలో ఉండే జీవితాలకు వెలుగును అందించు. 

మరింత సమాచారం తెలుసుకోండి: