నేటి మంచిమాట.. నీ శత్రువు కన్నా నీ నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. అవును.. శత్రువు ఎప్పుడో ఒకసారి టైం చూసుకొని నిన్ను తొక్కేస్తారు.. ఆ టైంలో కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటేనే నిన్ను తొక్కేస్తారు. కానీ.. నిర్లక్ష్యం.. ఆ ఎవరు ఏం అంటారులే ? అనే నిర్లక్ష్యం.. చెయ్యాల్సిన పనిని పోస్ట్ పోన్ చేసి.. అందరితో మాటలు పడుతుంటారు. 

 

ఈ కాలానికి ఆ నిర్లక్ష్యం ఒక్కటి ఉంటే సరిపోతుంది.. జీవితం నాశనం అవ్వడానికి. అందుకే నీ శత్రువు కన్నా ఎక్కువ కీడు చేసేది నీ నిర్లక్ష్యమే. అందుకే నిర్లక్ష్యం లేకుండా జీవితంలో ఎప్పుడు చురుకుగా ఒకరితో మాటలు పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఒకరితో మాట పడకుండా ఉండాలి. కష్టం అయినా సరే.. అలవాటు చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. 

 

ఇవి అన్నీ తెలుసుకొని మసలుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒకరితో మాట పడకుండా జీవించే జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదు అని.. ఎవరు ఎన్ని అంటే ఏంలే మనకు ఏం అవుతుంది ? అన్నట్టు ఉంటే ? జీవితంలో మీరు ఎప్పటికి ఎదగలేరు.. అందుకే జీవితం సాఫీగా సాగాలి అంటే నిర్లక్ష్యాన్ని వదిలెయ్యండి. అద్భుతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: