నేటి మంచిమాట.. క్షమించేవాడు మనిషి.. క్షమించు అని అడిగేవాడు పెద్దమనిషి. నేటి తరంకు క్షమాపణలు విలువ తెలీదు అంటే నమ్మండి.. మనకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు.. ఇబ్బందులు పడిన కూడా కొందరిని క్షమిస్తాం. కానీ కొందరిని ఎన్ని జన్మలకు క్షమించలేం. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయం అలాంటిది.  

 

ఇకపోతే.. కొందరు మంచివారు ఉంటారు. క్షమించు అని ఆడకపోయినా సరే.. మీరు ఎంత అన్యాయం చేసిన సరే.. క్షేమించేసి మనిషి మానవత్వాన్ని చూపుతారు. మరికొందరు ఉంటారు. ఎంత తప్పు చేసిన సరే క్షేమించు అని అడగరు. ఏంటి అంటే ఇగో అడ్డు వస్తుంది అని.. ఈ కాలంలో అలా ఇగో ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. 

 

కానీ అలాంటి ఇగోను పక్కన పెట్టి ఎవరైతే మనిషిని క్షమించు అని అడుగుతారో వాళ్ళు పెద్ద మనిషి. క్షమించు అని అడగటం ఎవరి వల్ల కాదు ఈ కాలం వాళ్లకు. కానీ తప్పు చేశాం అని పశ్చాత్తాపపడి క్షమించు అని అడిగారు అంటే తప్పు చేసిన వారిని క్షమించేయాలి. అలా క్షమించేవాడు మనిషి అయితే.. క్షమించు అని అడిగేవాడు పెద్దమనిషి అవుతాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: