నేటి మంచిమాట అందం ముఖంలో ఉండదు.. సహాయం చేసే మనసులో ఉంటుంది. అవును అందం అంటే పైకి కనిపించేది కాదు.. మనసులో ఉండేది. అలాంటి ఈ అందం ముఖంలో ఉండదు.. శరీరం కాదు.. రంగు కాదు. అందం అనేది సహాయం చేసే మనసులో ఉంటుంది. అది అందరికి కనిపించదు. 

 

సమయం వచ్చినప్పుడే అందం బయటపడుతుంది. అది తెలుసుకోకుండా పైకి కనిపించే అందం కోసం కష్టపడుతుంటారు కొందరు.. ఎవరికైన కష్టం వచ్చింది అంటే నేను ఉన్నాను అనే వారు అందమైనవారు.. పేదలకు కష్టం వచ్చింది.. కాస్త అన్నం పెట్టండి అమ్మ అని అడిగినప్పుడు.. తన దగ్గర ఉన్నది కూడా ఇచ్చేవారిలో ఉంటుంది ఆనందం. 

 

అలా పైకి కనిపించేది కాకుండా.. మనసును చూసి అందంగా ఉన్నారా లేదా తెలుసుకోండి. అంతేకాని ముఖ ఆనందాన్ని చూసి మోసపోకండి. అందం అనేది ఎప్పుడు ముఖంలో ఉండదు.. సహాయం చేసే మనసులో ఉంటుంది. మంచి గుణం ఉన్నవారిలో అందం  ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: