నేటి మంచిమాట.. జీవితంలో ఎన్ని సార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. అవును.. ఎన్ని సార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. ఆ అవకాశం పేరే రేపు అనేది. ఒక్కసారిగా ఓడిపోగానే.. ఓడిపోయాం కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ వాళ్ళకు ఏం తెలుసు.. ఓడిపోయినా మళ్లీ గెలుస్తారు అని. 


 
ఎంతోమందికి తెలియదు.. ఓడిపోయినా మళ్లీ గెలవగలుగుతాము అని. అయినా ప్రయత్నించగానే గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ మొదట ఓడిపోయిన వారే.. ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప వాళ్ళు గెలవలేదు. వాళ్ళు కూడా మనలాగే ఒకసారి ఓడిపోగానే ప్రయత్నం చెయ్యడం ఆపేసి.. ఇంకా అవకాశాలు లేవు అనుకొని ఉంటే వాళ్ళు గెలవగలరా? 


 
థామస్ అల్వా ఎడిసన్.. మనం ఈరోజు వెలుగులో ఉన్నాము అంటే అది ''థామస్ ఆల్వా ఎడిసన్'' వల్లే. అయన కొన్ని వందల సార్లు ఎలక్ట్రిక్ బల్బును తయారు చెయ్యడానికి ప్రయత్నించాడు. అలా ప్రయత్నించిన వెయ్యో సారి అయన బల్బును కనుక్కున్నాడు చరిత్రకెక్కాడు. అందుకే.. జీవితంలో ఎన్ని సార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ''రేపు'' అనేది ఉంటుంది అనేది గుర్తు పెట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: