నేటి మంచిమాట... సాయం అడిగేవాడు భక్తుడు.. సాయం చేసేవాడు దేవుడు. అవును.. ఈ మాట అక్షరాలా నిజం. సాయం చేసేవాడు దేవుడుతో సమానం. కానీ కొందరు సాయం చేసిన ఆ విలువను పెట్టుకోరు. ఎలా అంటే? వాళ్లకు అవసరం ఉన్నప్పుడే కనిపిస్తాం.. లేదు అంటే కనిపించం అని. 

 

కానీ ఇది ఎందుకు గుర్తు పెట్టుకోరు? వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే విల్లు వెలుగుల కనిపిస్తారు అని.. అయినా మనకు ఏదైనా కష్టం వస్తే దేవుడా.. ఈ పని తొందరగా చేసి పెట్టు దేవుడా అని కోరుకుంటారు కదా! అలానే ఇది కూడా. దేవుడు దగ్గరకు వెళ్లి ఒక టెంకాయి కొట్టగానే.. ఎన్ని కోరికలు కోరుతాం.. ఇంకా కొందరు అయితే వెళ్లి ఆఫర్స్ కూడా ఇస్తారు. 

 

నువ్వు నాకు ఈ కోరిక తీర్చావు అంటే నీకు 10 టెంకాయిలు కొడుతా అని. ఇలా మనిషి అంటేనే స్వార్థం. స్వార్థం లేని మనిషి ఉండడు. అందుకే అంటారు.. సాయం అడిగేవాడు భక్తుడు అయితే సాయం చేసేవాడు దేవుడు అవుతాడు అని. అందుకే మీరు బాగుండండి.. సాయం చేసి మరొకరిని ఆనంద పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: