నేటి మంచిమాట... మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది.. అవునా ? కదా? నేను అయితే అవును అనే చెప్తా.. ఓర్పుగా ఉంటె బంధాలు కలుస్తాయి. కానీ ఓర్పు ఎంతవరుకు? మీరే చెప్పండి. కొందరు ఉంటారు ముర్కులు ఎంత చెప్పిన సరే అర్థం కాదు ఆ ముర్కులకు. అయ్యో అని అనుకున్న సరే ఓర్పును పరీక్షిస్తారు ముర్కులు.

 

అలానే ఓర్పును పరీక్షించినప్పుడు స్పందించకుండా.. ఎం అనకుండా ఉంటే ఎం అంటారో తెలుసా? పిరికోడు అని అంటారు. ఎం అంటారు పిరికోడు అని.. మనవాళ్లే కదా.. ఎం అనకూడదు.. వాళ్ళు మాట్లాడే మాటలను మనం వ్యతిరేకిస్తే వారి పరువు పోతుంది.. దూరం అవుతారు.. మనస్పర్థలు వస్తాయి అని మనం ఆలోచిస్తే.. 

 

వాళ్ళు మనల్ని పిరికివాళ్ళ కింద లెక్కపెడుతారు. అయినా వాళ్ళు ఎంత టార్చర్ చేసిన మనం ఏమి రియాక్ట్ అవ్వకపోతే మనది పిరికితనమే అవుతుంది. కాబట్టి మన తప్పు లేదు అంటే ఖచ్చితంగా మనం తిరగబడాలి.. తిరగబడకపోతే మనకు ఆ శక్తి లేదు అనుకుంటారు. మితిమీరిన ఓర్పు ప్రాణాంతకం. 

మరింత సమాచారం తెలుసుకోండి: