నేటి మంచిమాట.. ఆలస్యం అయినా.. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. అవును.. ఆలస్యమైనా సరే న్యాయమే గెలుస్తుంది. కానీ చాలామందికి ఈ విషయం ఏమాత్రం అర్థం కాదు. ఎందుకంటే వారు తాత్కాలికంగా జరిగిన విషయాన్నే చూస్తారు కాబట్టి.. ఆలస్యం అయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది అనే విషయం ఈరోజు ప్రూవ్ అయినా సంగతి తెలిసిందే. 

 

ఏ విషయం ? ఏం ప్రూవ్ అయ్యింది అనుకుంటున్నారా? అదేనండి.. దేశాన్ని కదిలించిన నిర్భయ ఘటన విషయంలో 8 ఏళ్ళ తర్వాత ఈరోజు న్యాయం జరిగింది. ఆ దోషాలకు ఈ జన్మకు ఉరి పడదు అని అర్థం అయిపోయింది. ఆ దోషులు జైల్లో చస్తారు కానీ వారికీ ఉరి శిక్ష పడిన మళ్లీ ఏదో ఒక విధంగా తప్పించుకుంటారు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. 

 

ఎందుకంటే.. వాళ్లకు ఉరి శిక్ష రెండు సార్లు వాయిదా పడింది. పాపం.. ఆ నిర్భయ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది అంటే నమ్మండి. ఇంకా అసలు ఆ నీచులకు శిక్ష పడదు.. అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి.. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసిన.. ఆలస్యంగా అయినా.. అంతిమంగా న్యాయమే గెలిచింది. అందుకే పెద్దలు అనేవారు.. ఆలస్యం అయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: