నేటి మంచిమాట... చచ్చేవరకు పిల్లల సంక్షేమం కోరేదే అమ్మ. అవును.. ఈ విషయం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మ మనల్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పుట్టినప్పటి నుండి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. 

 

కంటికి రెప్పలా మనల్ని కాపాడుతుంది. మనకు ఏదైనా సమస్య వచ్చింది అంటే అది తీరే వరుకు అమ్మ మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాంటి అమ్మను మనం ఒకానొక సమయం వచ్చాక నిర్లక్ష్యం చేస్తాం. కానీ అది ఎంత పెద్ద తప్పు అనేది మనకు అప్పుడు తెలీదు.. అమ్మ మనకు దూరం అయినప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ. 

 

అమ్మ దూరం అయ్యాక విలువ తెలిసిన ఉపయోగం లేదు.. మీరు క్షమాపణలు చెప్పిన వినేకి అమ్మ ఉండదు. అందుకే అమ్మను ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి.. ఆనందంగా గడపండి.. మీరు పుట్టినప్పటి నుండి మిమ్మల్ని పెంచడానికి అమ్మ ఎన్నో కష్టాలు పడి ఉంటుంది. అలా కష్టాలు పడి పెంచిన అమ్మ కష్టసుఖాలను తెలుసుకొని ఆమెకు తోడుగా ఉండండి.. అమ్మను ఆనంద పెట్టి మీరు ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: