నేటి మంచిమాట.. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు! అవునా ? కదా? నేను అయితే అవును అనే చెప్తాను. ఎందుకంటే కాలం విలువ తెలియని వారు జీవితం విలువ ఎప్పటికి అర్ధం చేసుకోలేరు. ఎందుకంటే? కాలం విలువ తెలియని వారు కాలం గురించి ఆలోచించకుండా కాలాన్ని అంత వృధా చేస్తారు. 

 

అలాంటి వారు అంత కూడా కాలం వృధా అయినందుకు ఎప్పుడు బాధ పడరు.. ఎన్నడూ దాని గురించి తెలుసుకోరు.. దాని వల్ల కాలం అంత కూడా వృధా అవుతుంది. కాలం వృధా అయ్యాక దాని విలువ తెలిసిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కాలం తిరిగి రాదు.. జీవితం అంటే ఏంటో తెలీదు.. 

 

ఆకలేసినప్పుడు తినడం.. నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం తప్ప.. ఒక లక్ష్యం ఉండదు.. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉండదు. అలాంటి వారు మనిషిగా కంటే జంతువులనే పనికొస్తారు. జంతువులకు ఎలాంటి లక్ష్యం ఉండదు కదా! వాటికీ ఇష్టం వచ్చినట్టు బతుకుతాయి.. తినాలి అన్నప్పుడు తింటాయి.. పడుకోవాలి అనుకున్నప్పుడు పడుకుంటాయి.. నిజానికి కొన్ని జంతువులు కూడా మనకు ఎంతో సాయం చేస్తాయి.. కానీ లక్ష్యం లేని మనిషి వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: