నేటి మంచిమాట.. అందమైన జీవితం అనేది వెతికితే దొరకదు మనం నిర్మిస్తేనే తయారవుతుంది. అంతే కదా! ఈరోజు మనం చేసే పని ద్వారానే మన జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. నిజానికి మన జీవితం అందంగా.. అర్ధవంతంగా ఉండాలి అంటే మనం చిన్నప్పటి నుండే ఎంతో బాధ్యతగా ఉండాలి.. కాస్త భయం ఉండాలి. 


 
అప్పుడే మన జీవితం అందంగా తయారవుతుంది. అందమైన జీవితంగా మారుతుంది. చిన్నప్పుడు అమ్మానాన్న చెప్పిన మాటలు విని బుద్ధిగా చదువుకొని... అల్లరి చిల్లర వేషాలు వెయ్యకుండా బాధ్యతగా మెలిగితే జీవితంలో ఏదీ తక్కువ కాకుండా అంతా మంచే జరుగుతుంది. అలా మెలిగిన వారు జీవితాన్ని అందంగా నిర్మించున్నవారు అవుతారు. 


 
అలా కాదు అని.. భయం బాధ్యతలు లేకుండా... పెద్దలు చెప్పిన మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టు చిన్న వయసులోనే తప్పులు చేస్తే, కెరీర్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీవితం మీరే నాశనం చేసుకున్నవారు అవుతారు. అయితే జీవితాన్ని అందంగా తయారు చేసుకోవడానికి చిన్నప్పటి నుండే బాధ్యతగా ఉండకపోయినా.... కనీసం ఇప్పటినుండైనా ఇంట్లో వారి గురించి అలోచించి బాధ్యతగా జీవిస్తే అందమైన జీవితం సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: