నేటి మంచిమాట.. అవసరానికి పనికిరాని ఆస్తులు, ఆపదలో ఆదుకోని స్నేహితులు ఉన్నా లేనట్టే. అవును ఇది అక్షరాలా నిజం. కొందరు స్నేహితులు ఉంటారు... మనతో అన్ని ఉన్న సమయంలో మనకు దగ్గరగా ఉంటారు.. మనతో పనులు జరుపుకుంటారు. మనతో ఏమి లేని రోజునా.. మనకు కష్టం వచ్చిన రోజునా వారు ఎవరు మనకు కనిపించరు. 

 

అలాగే అవసరానికి పనికిరాని ఆస్తులు ఉన్న ఉపయోగం లేదు.. అవును.. ఆస్తులు అన్ని ఉంటాయి.. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు కొనడానికి ముందుకు రారు. అలాంటి సమయంలో ఆ ఆస్తులు ఉన్న ఉపయోగం ఉండదు. మనం ఎంత అనుకున్న సరే ఆ ఆస్తుల వల్ల చిల్లి గవ్వ ఉపయోగం కూడా ఉండదు. 

 

అందుకే.. మనకు ఉపయోగపడే ఆస్తులు.. ఆపద ఉన్నప్పుడు ఆదుకొని స్నేహితులు వృథా అనే చెప్పాలి. అందుకే మనకు ఒక్క స్నేహితుడు ఉన్న.. మనకు కేవలం కాస్త ఆస్తే ఉన్న మన అవసరానికి ఉపయోగపడి.. మనకు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు ఉంటే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: