నేటి మంచిమాట.. ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం, తిరిగి ఆశించటం కాదు! అవును.. ఈ విషయం తెలియని చాలామంది ప్రేమను స్వార్థంగా ఆస్వాదిస్తారు. నేను నిన్ను ప్రేమించా కదా! నన్ను నువ్వు ప్రేమించు అని వెంటపడుతారు. అలాంటి వాళ్ళని మనం కూడా ఎం చెయ్యలేం. కానీ వారికీ తెలియచేయాలి.. 

 

మీరు ప్రేమించిన అంత మాత్రానా.. మీరు జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రానా.. మీరు సహాయం చేసినంత మాత్రాన వాళ్ళు చెయ్యాల్సిన అవసరం లేదు.. వాళ్ళు చెయ్యాలి అని మీరు ఆశిస్తే మీరు స్వార్థపరులు అనే అర్ధం. అలాంటి స్వార్థం లేకుండా ప్రేమించటం మంచిది. మీ ప్రేమలో నిజం ఉంటే ? వారికీ మీపై ప్రేమ ఉంటే వారే మిమ్మల్ని ప్రేమిస్తారు. 

 

ఒకవేళ మీరు వారి ప్రేమ కోసమే వారిని ప్రేమిస్తుంటే మీ మనసులోని మాటను చెప్పేయండి.. వారు ఓకే చెప్తే ప్రేమించండి. లేదు అంటే లేదు.. అంతే కదా! ఈ మంచిమాటకు ఆర్య సినిమానే నిదర్శనం.. హీరో ఫీల్ మై లవ్.. ఫిల్ మై లవ్.. అని అంటాడు తప్ప తిరిగి ప్రేమించమని అడగడు.. నేను నిన్ను ప్రేమిస్తున్న.. ఆ ప్రేమను ఆస్వాదించు.. నన్ను తిరిగి ప్రేమించాల్సిన అవసరం లేదు కదా అని అప్పట్లోనే సుకుమార్ ఈ లైన్ పై ఆర్య అనే సినిమాను తీసేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: