నేటి మంచిమాట.. ఇతరుల గురించి నీకు చెప్పేవారు.. నీ గురించి ఇతరులకు చెప్తారు! హా మరి.. అక్కడది ఇక్కడ.. ఇక్కడది అక్కడ చెప్పడంలో వాళ్ళు ఉంటారు.. కానీ మనం ఏం అనుకుంటాం.. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు.. మనకు వాళ్ళ గురించి చెప్తారు కానీ.. మన విషయాలు వాళ్లకు చెప్పారు అనే ఆలోచనతో మన విషయాలు అన్ని వాళ్లకు చెప్పేస్తాం.. 

 

వాళ్ళు ఎం చేస్తారు.. పిల్లిలాగా అన్ని విషయాలు వెళ్లి ని శత్రువుకు చేరవేస్తారు.. అందుకే మనకు చెప్పే వారితో మనం ఎలాంటి విషయాలు చెప్పకూడదు.. వాళ్ళు చెప్పినవి విని సైలెంట్ గా ఉండాలి.. లేదు అంటే వాళ్లకు బదులు మీకు కష్టాలు వస్తాయి. నిజం చెప్పాలి అంటే అసలు అలా చెప్పే వారిని దగ్గరకు రానివ్వకపోవడం మంచిది. 

 

అంతేకాదు ఇతురుల విషయాలు తెలుసుకోవాలి అని అనుకోవడం ఒక పెద్ద చెడ్డ గుణం. అందుకే ఇతురుల విషయాల గురించి తెలుసుకోకుండా ఎవరి పని వారు చేసుకోవడం మంచిది.. అలా చెప్పే వారిని కూడా సాధ్యమైనంత దూరం పెట్టాలి.. అప్పుడే ఎటువంటి సమస్యలు ఉండవు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: