నేటి మంచిమాట.. మందలో ఉండకు వందలో ఉండటానికి ప్రయత్నించు! అంతేకదా! మందలో మనం ఉంటే మనకు ప్రత్యేకత ఎం ఉంటుంది.. మన పిచ్చి కానీ ప్రత్యేకత వరుకు వెళ్లారు.. అసలు మన గురించి ఆలోచించే వారు ఎవరు ? మన గురించి పట్టించుకునే వారు ఎవరు? మందలో ఉంటే ఆ మంద చెడిపోతే నువ్వు కూడా చెడిపోతావు.. లేదు అంటే నీకు మంచి పేరు ఉంటుంది. 

 

గొర్రెల మందలా.. ఒక గొర్రె ఈశాన్యం వైపు తిరిగితే మిగితా గొర్రెలు అన్ని అటువైపుకే తిరుగుతాయి.. ఒక గొర్రె కొండపై నుండి దూకేస్తా మిగితా గొర్రెలు అన్ని కూడా దూకేస్తాయి. అలా దూకేస్తే ప్రాణాలు పోతాయి.. అదే ఆ మందలో గొర్రెల కాకుండా కొంచం తెలివిగా ఆలోచించి గొర్రెలా ఉండకండి అని ఒక తెలివైన గొర్రె చెప్తే మిగితా గొర్రెల ప్రాణం కాపాడినట్టు అవుతుంది.. అలాగే నీకు ఒక గుర్తింపు వస్తుంది. 

 

ఇక పోతే ఇలాంటి గొర్రెలను మనం 10థ్, ఇంటర్ లో చూసి ఉంటాం.. గొర్రెల మందను.. నారాయణ, శ్రీ చైతన్య వంటి కాలేజ్ ల్లో పిల్లలు సచ్చినా బ్రతికిన మార్కులు హైరేంజ్ లో రావాలి. అలా కాదు అని వచ్చాయో బతకరు బిడ్డ అని స్టార్టింగ్ నుండి ఆ మందను బెదిరించి అందరిని బ్రెయిన్ లేని విద్యార్థులుగా.. లోకజ్ఞానం లేని పశువులు ఎందరినో తీర్చుదిద్దుతున్నాయి ఇలాంటి సంస్దలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: