నేటి మంచిమాట.. తమకు తామే గొప్ప అనుకునే వారు అభివృద్ధి చెందలేరు! అవును.. కొందరు ఉంటారు.. వారికీ ఏమి చేతకాదు.. ఒకరి సహాయం లేనిదే సొంత పనులు కూడా చేసుకోలేరు.. అలాంటి వాళ్ళు అనుకుంటుంటారు.. తమకు తామే గొప్ప అని.. కానీ అలా అనుకోని ఇతరుల వద్ద పొగరు చూపించిన వారు విజయం పొందినట్టు చరిత్రలో లేదు. 

 

కొందరి ఆలోచనలు చాల బిన్నంగా ఉంటాయి. ఎంత బిన్నంగా అంటే మరెవరివి అంత అనాలోచితంగా ఉండవు... ఆలు లేదు... సోలు లేదు...కోడుకు పేరు సోమలింగం అంట! అన్నట్టు ఏమి తెలియకుండానే.. వారికీ వారే గొప్ప అనుకుని.. మిగితా అందరిని చిన్న చూపు చూస్తారు.. ఆ చిన్నచూపు చూడటం వల్ల అందరి ద్రుష్టి వారిపై పడుతుంది. 

 

ఇతను ఎం సాధిస్తాడో మేము చూస్తాంలే అని అనుకోని.. సైలెంట్ గా ఉంటారు.. ఒకవేళ గెలిచాడు అంటే అబ్బో అనుకుంటారు.. అదే ఓడిపోయాడు అనుకో.. ఈ జీవితం ఎందుకు రా స్వామి అని అనుకునేలా తిడుతారు.. అప్పుడే చెప్పం.. ఈ మూర్కుడు ఎక్కడ వింటాడు.. అంత విడికే తెలుసు అని అనుకుంటాడు.. జీవితం నాశనం చేసుకున్నాడు అని అంటారు.. అందుకే మీకు ఎంత తెలిసిన అది కేవలం, గోరంతనే.. తెలియాల్సింది కొండంత.. అందుకే అన్ని మీకే తెలుసు అని అనుకోకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: