నేటి మంచిమాట.. అవసరానికి ఉపయోగపడని కళ వ్యర్థం! అనుకుంటాము కానీ.. కళ ఉంటే సరిపోదు... ఏదైనా అవసరం ఉన్నప్పుడు అది బయటపడాలి.. లేకుంటే నీ కళ ఎవరి తెలుస్తుంది. ఎవరికి ఉపయోగపడుతుంది.. నిన్ను ఏదో నీ కళ అంత ఎక్సబిషన్ లో లా షో చెయ్యమని చెప్పడం లేదు.. అవసరినికైనా నీ కళను బయట పెట్టాలి కదా! అలా పెట్టకుంటే ఎలా చెప్పు? నువ్వు నేర్చుకున్న కళ కనీసం నీకు కూడా ఉపయోగపడకపోతే ఇంకా అది ఎందుకు? 

 

కొందరు ఉంటారు.. సుంటాలు.. ఏ పని రాదు.. ఏ కళ పూర్తిగా నేర్చుకోలేరు.. కానీ ఓ రేంజ్ లో డప్పు కొట్టుకుంటారు.. వాళ్ళ దగ్గర లేని కళని కూడా చూపించడానికి ప్రయత్నిస్తారు.. ఎవరో కళను కాపీ కొట్టి మరి హిట్ కొడుతారు.. కానీ కొందరు మాత్రం ఉన్న కళను కూడా చూపించుకోరు..అహంకారం .. ఎంతవరుకు కరెక్ట్ చెప్పండి.. మనిషికి ఉండకూడనిది అహంకారం. 

 

ఉండాల్సింది.. సాయం చెయ్యాల్సిన గొప్ప గుణం. మనిషికి మనిషికి సాయం చేసుకునే గుణం లేకపోతే ఇంకా ఎందుకు చెప్పు. ఒకే మనిషికి అన్ని కళలు రావు.. ఒకవేళ రావాలి అంటే వాడు ఏ వెయ్యి ఏళ్ళ మనిషో కావాలి. అందుకే.. శిల్పి రాయిని కూడా శిల్పాన్ని చేస్తే.. ఆ శిల్పానికి రంగులు వేయాల్సిన వాడు వేరు ఉంటారు.. అలానే ప్రస్తుతం ఎన్నో కళలు.. అన్ని అద్భుతాలే..

 

కళ అనెది నీకు మాత్రమే ఉపయోగపడేది కాదు.. అందరికి ఉపయోగపడేది. అందుకే ఆ కళను ఎక్కడ.. ఎప్పుడు బయటకు తియ్యాలి అనేది తెలుసుకొని బయటకు తిస్తె నీకు కావాల్సిన గౌరవం, సంపద అన్ని వస్తాయ్. అలా కాదు అని స్వార్థంగా ఆలోచిస్తే.. అవసరానికి ఆ కళను ఉపయోగించకపోతే అది వ్యర్థం.             

మరింత సమాచారం తెలుసుకోండి: