నేటి మంచిమాట.. జీవితంలో కష్టం లేనిదే గెలవలేం! అవునా? కదా? నిజం కదా! మనం కొన్ని అనుకోని ఉంటాం.. అవి గెలవాలి అని కూడా అనుకుంటాం.. కానీ గెలవలేం. ఎందుకు గెలవలేం? జవాబు దొరికిందా? అసలు మనం కష్టం చేస్తేనే కదా !ఫలితం లభించేది.. లేకుంటే ఏ ఫలితం లభిస్తుంది ? అసలు మనం ఎలా గెలవగల్గుతాం.. 

 

మనిషి అంటేనే కష్టం. పుట్టిన సమయం నుండి కష్టపడుతూనే ఉండాలి.. ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి... పిల్లలు మూడేళ్ళ వరుకు ఎటువంటి కష్టం లేకుండా.. ఎంతో సుఖంగా పెరుగుతారు.. మూడు సంవత్సరాల నుండి జీవితం మొదలవుతుంది. చదువు చదువు అని.. రాత్రిపగళ్ళు కష్టపడి చదివితేనే క్లాస్ ఫస్ట్ వస్తాం.. 

 

అలా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని కష్టపడి చదివితేనె చివరికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చింది అని ఇంకా లైఫ్ ఎంజాయ్ చేస్తావా? అంటే చెయ్యలేవు! ఎందుకు చెయ్యలేవు? అంటే అక్కడ మళ్ళీ కష్టపడాలి.. నువ్వు చెయ్యాల్సిన పని కంటే ఎక్కువ పని చేస్తేనే ప్రేమోషన్ వస్తుంది.. కాస్త పేరు వస్తుంది.. కాస్త డబ్బు వస్తుంది.. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చేసుకుంటావు.. 

 

ఆ సరే.. చదువును జేయించాం.. ఉద్యోగాన్ని జేయించాం అని అనుకునేలోపు పెళ్లి.. పిల్లలు.. ఆరోగ్యం లేని తల్లితండ్రులు.. అన్ని ఒకదానిపై ఒకటి వస్తూనే ఉంటాయి.. కష్టపడాలి.. డబ్బు సంపాదించాలి.. భార్యను.. పిల్లలను సుఖంగా చూసుకోవాలి.. తల్లితండ్రుల చివరి రోజుల్లో వారికీ ఆనందం పంచాలి.. ఇదే జీవితం.. 

 

కష్టపడితేనే విజయం సాధిస్తావు.. ఆ విజయం వల్ల జీవితాంతం ఆనందగా ఉండకపోయినా.. ఆ కొద్ది క్షణాలు.. నిముషాలు అయినా ఆనందంగా ఉంటావు.. జీవితంపై విరక్తి పుట్టాలి అని చెప్పలేదు.. ఉన్నది ఉన్నట్టు చెప్పం. పైన చెప్పినది అంత చదువుకున్న వారి జీవితం గురించి.. చదువులేని.. చదువుకొని వారి జీవితం ఇంకేంత నరకంగా ఉంటుందో ఉహించుకోగలరు.. అందుకే కష్టం విలువ తెలుసుకోండి.. కష్టపడండి.. జీవితాన్ని ఆనందంగా గడపండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: