నేటి మంచిమాట.. మాట‌లు చూస్తే కోట‌లు దాటుతాయ్‌.. చేత‌లు చూస్తే నీటిమీద రాత‌లేన‌టోయ్! అవును కొందరు అంతే.. మాటలు చూస్తే ఎంతో అందంగా ఉంటాయి.. పనులు మాత్రం నీటిమీద రాతలు రాసినట్టే.. చెప్పింది ఒకటి చేసింది ఒకటి.. వీరినే అంటారు లీడర్ అని.. వేరే వారితో పని చేయించటానికి మాటలు చెప్తారు.. వారు మాత్రం చేసేది ఏమి ఉండదు.. ఎందుకంటే వారు లీడర్ కాబట్టి.. ఇలా ఆలోచిస్తారు కొందరు. తెలివైన వారు అనుకునే స్వార్థపరులు. 

 

కానీ నిజానికి వీరిని లోకం ఎం అంటుంది అంటే? మాటలెక్కువ పనులు తక్కువ అని.. లోకం తీరే అంత.. కాస్త అయినా తెలివి ఉంటే కదా!  అలా అనకుండా ఉండేందుకు.. అందుకే అసలు పూర్తిగా మాటలు తగ్గించండి.. మనిషికి దూరంగా ఉండండి.. మీ పని ఏదో మీరు సక్రమంగా చేసుకోండి.. సరిపోతుంది.. అంతేకాని అన్ని పనులలోకి వేలు పెట్టకండి.. అవమానాలపాలవ్వకండి .. ఎవరితోనో అనిపించుకోవాల్సిన అవసరం మీకు ఏముంది? చెప్పండి. 

 

మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటే ఇలా మిమ్మల్ని ఎందుకు అంటారు.. అయినా మీరు చెయ్యకపోతే మిమ్మల్ని అనాల్సిన బాధ్యత వాళ్లదే కదా! అందుకే.. మాట పడకూడదు అంటే మీ పని మీరు కరెక్ట్ గా చేసుకోండి.. జీవితాన్ని అందంగా మార్చుకోండి.. లేదు అంటే అవమానాలు పడుతారు రా బాబు.. ముందే చెప్తున్నా.. మీ పని మీరు సక్రమంగా చెయ్యకపోయినా.. మీ డ్యూటీకి మీరు సమయానికి వెళ్ళాకపోయిన అవమానాలు అవమానాలు తప్పవు.. మాటలు తప్పవు..                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: