నేటి మంచి మాట.. పరుల సొమ్ము పాము వంటిది. అవును.. పరుల సొమ్ము ఎప్పుడు మనకు మంచిది కాదు.. మనం కష్టపడి పని చేస్తే వచ్చిన డబ్బు తప్ప మనకు ఏది సొంతం కాదు.. కష్టం లేకుండా డబ్బు కావాలి అని దొంగతనాలు.. మోసాలు చేస్తే మన జీవితానికి ఎప్పటికైనా ప్రమాదమే.. అందుకే మోసాలు చెయ్యకూడదు.. 

 

పరుల సొమ్ము పాము వంటిది అనడానికి నేను చదివిన కథ మీకోసం.. ఒక అతనికి కూతురు పుట్టింది.. ఆ కూతురు పుట్టిన సమయం నుండి ఆమె పెళ్లి కోసం అని రూపాయి రూపాయి కూడబెట్టి బ్యాంకులో దాచుకున్నాడు.. ఇంకా అనుకున్నట్టుగానే పెళ్లి సమయం దగ్గర పడింది.. త్వరలోనే పెళ్లి.. అందుకే ఆ తండ్రి తన కూతురు కోసం దాచిన డబ్బుని బ్యాంకు నుండి తీశాడు.. 

 

బైక్ పైనే ముందు పెట్టుకొని వస్తున్నాడు.. ఉన్నట్టుండి ఓ బస్సు స్టాండ్ వద్ద సడెన్ బ్రేక్.. దీంతో ఆ బ్యాగ్ జిప్ ఫెయిల్ అయ్యింది.. 500 రూపాయిల నోట్లు అన్ని చెల్లా చెదురు అయ్యాయి.. దీంతో అక్కడ ఉన్న జనాలంతా ఎవరికి తోచిన డబ్బు వారు తీసుకుంటున్నారు.. దీంతో ఆ తండ్రి.. ఈ డబ్బు నా కూతురు పెళ్లి కోసం దాచుకున్నది.. దయ చేసి నాకు ఇచ్చేయండి అని కన్నీరుమున్నీరయ్యారు.. 

 

దీంతో మానవత్వం ఉన్న వారంతా ఆ డబ్బును తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు.. కొందరు మాత్రం చూసి చూడనట్టు ఉన్నారు. ఇంకా అక్కడే ఇద్దరు స్కూల్ పిల్లలు ఉన్నారు.. ఒకడు కార్తీక్.. మరొకడు రాజా. కార్తీక్ వంగి 500 రూపాయిలు జేబులో పెట్టుకున్నాడు.. ఇంకా  రాజా చూసి రేయ్ తప్పు రా.. ఆ అంకుల్ కి ఇచ్చేదం పద అన్న ఎం మాట్లాడకుండా బస్ ఎక్కి స్కూల్ కి వచ్చాడు.. 

 

ఫ్రెండ్స్ తో ఎప్పుడెప్పుడు పార్టీ చేసుకోవాలా ? అని ఎదురు చూస్తున్నాడు కార్తీక్. ఇంకా స్కూల్ కి రాగానే టీచర్ ఫిజ్ తీసుకొచ్చావ అని అడిగింది.. దీంతో జోబులో చూసుకుంటే అక్కడ నాన్న ఇచ్చిన వెయ్యి రూపాయిలు లేదు.. కేవలం 500 మాత్రమే ఉంది.. దీంతో ఏడవడం మొదలు పెట్టాడు.. అప్పుడు రాజా వచ్చి చూసావా అతని 500 అతనికి ఇవ్వమంటే ఇవ్వలేదు.. ఇప్పుడు చూడు నీ డబ్బు పోయింది అని.. నువ్వు 500 కి వంగినప్పుడు నీ జేబు నుండి వెయ్యి రూపాయిలు పడిపోయింది.. ఇదిగో అంటూ ఇచ్చాడు. ఎవరి డబ్బు వారికీ ముఖ్యమే.. పరుల సొమ్ము పాము వంటిది.. అందుకే ఎవరి సొమ్ము ఆశించకూడదు అని అన్నాడు రాజా. 

మరింత సమాచారం తెలుసుకోండి: