నేటి మంచిమాట.. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు సోమరిపోతు బంగారుగనిలో ఉన్నా బికారిగానే ఉంటాడు! అంతేకదా.. శ్రమను నమ్ముకున్నోడు ఎప్పటికైనా పైకి వస్తాడు.. శ్రమని నమ్ముకొని వాడు ఎప్పటికి ఎదగలేడు అంటుంటారు.. నిజం అది.. మనం పని చేస్తేనే మంచి ఫలితం.. లేదు అంటే ఏలాంటి ఫలితం ఉండదు. 

 

ఎప్పటికైనా ఫ్రీ గా వచ్చెనవి ఏవి ఎల్లకాలం ఉండవు అని అర్థం చేసుకోవాలి.. కష్టపడాలి.. కష్టపడితేనే నీ అయిదేళ్ళు నోట్లోకి వెళ్తాయి.. ఆకలి తీరుతుంది.. నిన్ను నమ్ముకున్న వారి జీవితంగా అందంగా ఉంటుంది. కష్టపడే గుణం ఉంటే నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు.. ఎవరితో ఒక మాట పడాల్సిన అవసరం ఉండదు. 

 

ఇంకా కష్టపడే గుణం లేదు.. ఎప్పుడు చూడు బద్దకంగానే ఉంటాం.. ఆ బద్దకాన్ని చూసి పరుపు కూడా ఆశయించుకుంటుంది.. అంత దారుణమైన బద్ధకం అది.. ఇంకా ఆలా బద్దకంగా ఉన్నవారికి ఎక్కడైనా ఒకటే.. బంగారు గని ఉన్న.. దీని సంగతి రేపు చూద్దాం లే అని ఆలోచిస్తాడు... అలా ఆలోచించేవాడికి బంగారు గని అయితే ఏంటి మరేదైనా అయితే ఏంటి ? 

 

అదేనండీ.. సోమరిపోతుకి.. శ్రమించేవాడికి తేడా.. శ్రమించేవాడికి దరిద్రం పట్టిన కష్టంతో ఎంతో అద్భుతంగా బ్రతకగలడు.. కానీ సోమరిపోతుకు అదృష్టం పట్టిన అడుక్కు తినే వాడిలానే బ్రతుకుతాడు.. ఇది జీవిత సత్యం.. అందుకే బద్దకాన్ని వదిలేయండి.. జీవితం ఎంతో అందంగా ఉంటుంది..                                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: