పెద్ద మాట చద్ది అన్నం మూట అంటారు.. పెద్దలు ఏది చెప్పినా అందులో ఏదో ఒక పరమార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే.  వేద పండితులు చెప్పిన ప్రతి విషయంలోనూ ఎంతో గొప్ప నిగూఢ రహస్యం దాగి ఉంటుంది.  ఇప్పటికే పెద్దవాళ్లు చెప్పిన సామెతల్లో ఎంతో పరమార్థం దాగిన ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.   

 

మీ కోసం కొన్ని మంచి మాటలు :

- మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం.

- థైర్యం,కాలం,ప్రక్రుతి,....ఈ మూడూ ఉతమమైన గొప్ప వైద్యులు .

-పరిస్థితులు కాదు మానవుణ్ణి స్రుష్టించింది. మానవుడే పరిస్థితుల్ని స్రుష్టించుకున్నాడు

-సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం.

-మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు.

-లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు

-ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు.

-బద్దకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా

- మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి

-చితి నిర్జీవులను కాలుస్తుంది…చింత సజీవులను దహిస్తుంది

-కష్టాలు ఒంటరిగా రావు…అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి

-సంసార సాగరం దాటలంటే…సంస్కారముల పరివర్తన కావాలి

-కోరికలు పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతుంది

-దేహ శుభ్రతతో పాటు భావ శుద్దత అత్యంత అవసరం

-ఒకరితో ఉన్న బంధం తెగిపోవాలంటే, వారి వైపు వేలెత్తి చూపితే చాలు. హుందాగా తప్పులు అంగీకరించే దొడ్డ

-మనస్సు చాలా మందికి ఉండదు. మనం తప్పులు చూపిన వెంటనే, వారు కూడా మనలో తప్పులు వెతకడం

-మొదలు పెడతారు. తప్పులు మాత్రం చూస్తూ ఉంటే బంధం ఎలా నిలుస్తుంది?

-పుణ్యాత్ములు దు:ఖాన్ని సుఖంగా, నిందల్ని పొగడ్తలుగా పరివర్తన చేస్తారు

-ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకొంటారో వారే విజయులై అన్నిట్లోనూ మొదటి స్థానంలో ఉంటారు

-బాల్యం విలువ అది గడచిపోతే కానీ తెలియదు

 

మరింత సమాచారం తెలుసుకోండి: