- పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం. 


- అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.


- మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.


- మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం... బలహీనతే మరణమని గుర్తించండి.


- వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు. 

 

- మనం ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తే మనవైపు నాలుగు వేళ్ళు చూస్తూవుంటాయి... ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెదకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో మంచే కనిపిస్తుంది.

 

- కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.  లక్ష్యాన్ని సాదించేవరకు నిరాశకు, నిస్పృహకు చోటివ్వక పట్టుదలతో కొనసాగితే తప్పక విజయం నిన్నే వరిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: