-  వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కానీ ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి. 

- ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో, ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. 

- నీ వెనక ఏముంది........ నీ ముందు ఏముంది ........ అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. 

- వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కాని ధనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనది. 

- మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం........ రెండూ నేరమే!

- మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 

- మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. 

- తక్కువ సంపాదన ఉన్నవారికన్నా తక్కువ  ఉన్నవారికే ఇబ్బందులు వస్తాయి. 

- నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. 

- మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం ఆనందమయం  అవుతుంది. 

- తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు. 

- మనసులో అసూయ, ద్వేషాలు లేని వాళ్లను అందరూ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. 

- ఏ పని చక్కగా చేయాలన్నా........ ముందు ఆ పనిలో ఆసక్తి ఉండాలి. 

- నోట జారిన మాట, చేజారిన అవకాశం, గడిచిపోయిన కాలం తిరిగి లభించవు. 

- ఏ పరిస్థితుల్లో ఉన్నా..... నీ కర్తవ్యం నీకు గుర్తుంటే ......... జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. 

- భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే......... భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. 

- హృదయ సౌందర్యం లేని శరీర సౌందర్యం వ్యర్థం. 

- ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే........ ఒక్క క్షణం

- అసహనం మొత్తం జీవితాన్నే నాశనము చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: