- ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. 

- మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా, చేతిలో ఉన్న వర్తమానంతో భవిష్యత్తు కోసం శ్రమించు!

-నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. 

-పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. 

- నిన్ను చూసి చప్పట్లు కొట్టే పదివేళ్ల కన్నా నీ కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న. 

- కష్టసుఖాలకు సంసిద్ధంగా ఉన్నవారే స్వేచ్చగా జీవించగలరు. 

- దేవుడు మనకు విజయాలనందివ్వడు. విజయం సాధించడానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. 

- ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో, పెత్తనం కాదు. 

-అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక!!

-లేని గొప్పతనం ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది. 

-అత్తరు దుకాణానికి వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని గ్రహిస్తాం. ఉత్తముల సాహచర్యమూ అంతే!

-మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలూ ఉన్నట్టే!

-మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. 

-జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరికినప్పుడు కలుగుతుంది. 

-శరీరానికి మరణం ఒక్కసారే. కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే!

-ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. 

-మనసు చెప్పినట్టు మనం వినడం కాదు........ మనం చెప్పినట్టు మనసు వినేలా చూసుకోవాలి. 

- వినడానికి కటువుగా ఉన్నా....... మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. 

- ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులకు సమానం. కానీ, ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. 

-భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే......... భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: