నేటి మంచిమాట.. విజయం ప్రయాణమేగానీ గమ్యం కాదు! అవును.. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడ్డావ్.. 20 ఏళ్లకు నీకు విజయం సొంతం అయ్యింది. విజయం వచ్చింది కదా అని నీ పనిని నువ్వు ఆపితే నీ జీవితం సర్వనాశనం అవుతుంది. అలా కాకుండా.. విజయం వచ్చిన సరే అక్కడికే నీ జీవితం కాదు కాబట్టి.. ఇంకా ఇంకా ఏదో సాధించాల్సిన అవసరం నీకు ఉంది కాబట్టి ఆ విజయాన్ని గమ్యంగా భావించకూడదు.. 

 

IHG

 

విజయం అనేది తాత్కాలికమే.. మనం ఎంతో సాధించాలి.. నువ్వు ఆ 20 ఏళ్ళ కష్టాన్ని విజయంగా భవిస్తాస్తే ముందున్న 80 ఏళ్ళ విజయం ఏనాటికి సొంతం అయ్యెను? అసలు అయ్యేనా? ఎంతో కష్టపడాలి.. 20 ఏళ్లకు విజయం సాధించినది నీకు మాత్రమే మంచి ఫలితాన్ని ఇస్తుంది.. కానీ నీ పిల్లలకు నీకు విజయం సొంతం అవ్వాలి అంటే ఈ 80 ఏళ్ళు కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. 

 

IHG

 

ఈ వందేళ్ల జీవితానికి ఒక్క విజయం సరిపోదు.. అలుపెరగని మనిషిలా కష్టపడుతూ లేదా తెలివిగా జీవించాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. అంతేకాదు.. ఇంకా ఇంకా ఎంతో కష్టంతో జీవించాలి. ఈరోజు నువ్వు కష్టపడితేనీ నీ పేరు చరిత్రలో నిలుస్తుంది. లేదు అంటే నీ మరణాంతరం నిన్ను మర్చిపోతారు ప్రజలు. అందుకే ఒక్క విజయంతో జీవితాన్ని జీవించడం ఆపకూడదు. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: