నేటి మంచిమాట.. నిత్యం కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం వరిస్తుంది! అవును.. ఏదైనా సరే కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. లేకుంటే ఎందుకు వస్తుంది? వూరికే వస్తే ఆ ఫలితానికి కూడా విలువ ఉండదు. అందుకే ఏదైనా సాధించాలి అంటే నిత్యం కృషి చెయ్యాలి. అప్పుడే విజయం వరిస్తుంది. మనం ఏదైనా ఒకటి సాధించాలి అంటే నిత్యం పని చెయ్యాలి. 

 

మనం ఒకసారి ప్రయత్నిస్తే ఓడిపోయాం మన ప్రయత్నన్ని ఆపకూడదు.. మనకు కావాల్సిన దాని కోసం నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి.. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. లేకపోతే మనం ఏది సాధించలేం. అందుకే ఏదైనా కానీ సాధించడానికి మనకు ఓపిక ఉండాలి.. ఒక్కరికే ఏది విజయం సాధించలేం. విజయం సాధించడానికి మనకు తెలివి ఉండాలి. ఓపిక ఉండాలి. 

 

ఎడిసన్ బల్బ్ కనుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.. కానీ అన్ని విఫలం అయ్యాయి. చివరి ప్రయత్నం చేశాడు.. ఫలించింది. దాని ఫలితమే ఈరోజు బల్బ్ కనుక్కున్నాడు. ఈరోజు మనం లైట్ వేసినప్పుడల్లా మనకు ఎడిసన్ గుర్తొస్తాడు. అలానే ఏదైనా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించలేరు. కష్టపడాలి అప్పుడే విజయం సాధించగలం. అందుకే కష్టాన్ని నమ్ముకుంటే ఎవరైనా సరే విజయాన్ని సొంతం చేసుకోగలరు. 

 

చెప్పులు కుట్టే అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు.. పేపర్ వేసే అబ్దుల్ కలం భారత్ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. అలానే మనం కష్టపడాలి.. మనకు కావాల్సిన సాధించే వరకు కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలం. అలా కాదు అని మనం కష్టపడకుండా ఉన్నంత కాలం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏమి విజయం సాధించలేం. మన పేరు చరిత్రకు ఎక్కాలి అంటే మనం కష్టపడాలి.                       

మరింత సమాచారం తెలుసుకోండి: