నేటి మంచిమాట.. ఒప్పుకొనే ధైర్యముంటే, తప్పులు ఎప్పుడూ క్షమించదగినవే. అవును.. నువ్వు ఒప్పుకునేలా అయితే ఆ తప్పులు ఉండవు కదా! ఎంత తప్పు చేస్తే ఏంటి నవ్వుతు సమస్యను తీర్చుకునే శక్తి నీకు ఉంది అంటే ఎంతటి తప్పుని అయినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని రేలంగి మావయ్య లాగా నవ్వుతూ క్షేమించేస్తావు కదా! అయినా మనుషులందరూ ఆ సినిమాలోని రేలంగి మావయ్య లాగా ఉండాలి అంటే అవుతుందా? 

 

అంత కామన్ విషయం కాదు కదా! సినిమా కాబట్టి అతను అయినా అంత ప్రశాంతంగా ఉన్నాడు.. అతని భార్య కూడా కాస్త నెమ్మదిగా సైలెంట్ గా ఉంది. కానీ రియాలిటీలో అలా కాదు కదా! కోపం వస్తుంది కదా! భర్త ఊరంతా నవ్వుకుంటూ తిరిగి ఏమి సంప్రదించకుండా మనపై కోప్పడిన వారిని.. అవమానించిన వారిని కూడా సంతోషంగా చూసుకోవడం అనేది మాములు విషయం కాదు కదా! మనం మనుషులం.. అందుకే ఈ తప్పును అంత ఈజీగా క్షేమించలేం. 

 

కానీ.. కానీ మనిషిని క్షేమిస్తే తప్పుని ఒప్పుకునే దైర్యం ఉంటే జీవితం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మీరు కాస్త మంచి గుణంతో అందరిని క్షేమించే గుణం గల వారిలా ఉంటే ఎవరినైనా క్షేమించేస్తారు. అలా కాకుంటే ఎవరిని క్షేమించలేరు. అయినా క్షేమించడం అనేది చాలా కష్టమైన పని. ప్రపంచంలోనే అతి కష్టమైన పని క్షేమించడం. క్షేమించాలి అని అనుకోవడం మన తప్పే అవుతుంది. చిన్న చిన్న తప్పులు అయితే క్షేమించేస్తాం. కానీ ఆ దెబ్బలు మన గుండెకు తగిలితే ఎట్టి పరిస్థితిలోను మనం ఆ తప్పులను క్షేమించలేం. బ్రతికి ఉండే వరకు వారు చేసిన ఆ తప్పు మన గుండెల్లో గుచ్చుతుంటుంది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: