నేటి మంచిమాట.. హృదయంలో నిజాయతీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. ఈ మంచిమాట చెప్పింది ఎవరో కాదు అబ్దుల్ కాలం చెప్పారు. అవును.. నువ్వు నిజాయితీగా ఉంటే ఒకరికి నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ నిజాయతి నీ మాట తీరులోనూ.. నువ్వు చేసే పనిలోనూ కనిపిస్తుంది. 

 

IHG's President Dr. A.P.J. Abdul Kalam On His ...

 

నిజాయితీ ఉంటే నిన్ను ప్రతి ఒక్కరు నమ్ముతారు. అదే నిజాయితీ లేకుంటే నిన్ను ఎవరు నమ్మరు. అందుకే నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించాలి. అంతేకాదు అందం అనేది మన వ్యక్తిత్వంలోనే కనిపిస్తుంది. మేకప్ వేసో పౌడర్ రాస్తేనో మనకు ఆ అందం కనిపించదు. అందంగా కనిపించడానికి కూడా ఒక మంచి మనసు ఉండాలి. 

 

IHG

 

నిజాయితీ ఉన్నవారు ఏలాంటి సమస్యలలో చిక్కుకోరు. తమ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఎలాంటి టెన్షన్లు ఉండరు. కాబట్టి మనం చేసే పనిలో ఏలాంటి లోపం లేకుండా.. ఎవరిని మోసం చెయ్యకుండా.. వచ్చినదానితో సంతృప్తిగా ముందడుగు వెయ్యాలి. అంతే ఆనందంగా గడుపుతారు.. ఆహ్లదంగా గడుపుతారు.      

 

IHG

 

నిజాయితీగా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితం మనం హై క్లాస్ గా జీవించచ్చు.. ఎవరిపైన ఆధార పడాల్సిన అవసరం లేదు. ఏ పనినైనా మనకు మనం చేసుకుంటే ఆనందంగా జీవిస్తాము. అంతేకాదు.. ఒకరితో మాట పడాల్సి ఉండదు.. అయితే ఇందుకు నిజాయితీతో పాటు కాస్త తెలివి కూడా ఉండాలి. అప్పుడే ఆనందంగా జీవిస్తాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: