నేటి మంచిమాట.. ఉత్సాహంతో శ్రమించాలి.. అలసటను ఆనందంగా అనుభవించాలి! అవును.. యవ్వనంలో పని చెయ్యాలి.. ఎంత పని అంటే తినడానికి కూడా సమయం లేనంత పని చెయ్యాలి. ఫలితం రావడానికి సమయం పట్టిన మనకు వచ్చిన అలుపు ఆనందంగా అనుభవించాలి.. అప్పుడే నీ కష్టానికి ఒక అర్ధం ఉంటుంది. 

 

IHG

 

మనం లావు తగ్గాలి అన్న మనం కేవలం పస్తులు ఉంటే సరిపోదు.. దానికి తగ్గట్టు శ్రమించాలి. లావు తగ్గడానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే లావు తగ్గుతారు. ఉత్సాహంతో వ్యాయామం చెయ్యాలి.. ఇంకా మనకు వచ్చిన అలసటను ఆనందంగా అనుభవించాలి. అప్పుడే ఇంకా ఇంకా వ్యాయామం చేసి లావు తగ్గాలి అని అనిపిస్తుంది. 

 

IHG

 

కానీ చాలామంది ఆ అలసటను బరువు ఫీల్ అయ్యి.. మళ్లీ మళ్లీ వ్యాయామం చెయ్యాలి అని అనుకోరు. కానీ ఒక్కసారి ఆనందంగా అనుభవిస్తే జీవితంలో బరువు అనే సమస్యే ఉండదు. అందుకే ఏ పనినై కూడా వామ్మో చాలా కష్టం ఇది.. మనం చెయ్యలేము అని ముందుగానే నిరాశకు గురయ్యే బదులు..         

 

IHG

 

ఏ పనైనా సరే నేను చెయ్యగలను అని ఫీల్ అవుతే మీరు గెలుస్తారు. ఏ పనినైనా ఉత్సాహంగా చేసుకోగలిగే శక్తి మీలో ఉండాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. అలసట వచ్చిన సమయాన్ని టెన్షన్ లేకుండా ఆనందంగా జీవించగలరు. ఉత్సాహంతో శ్రమించాలి.. అలసటను ఆనందంగా అనుభవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: