నేటి మంచిమాట.. అన్ని విజయాలకు మూలం సాధించాలన్న బలమైన కోరికే! అవును.. మనకు ఏదైనా కావాలన్నప్పుడు ఇది ఖచ్చితంగా సాధించాలి.. నేను ఈ స్థాయిలో ఉండాలి అనేది మీలో బలంగా ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా విజయం సాధించగలరు. మన కోరికతో పాటు దానికోసం కృషి కూడా చెయ్యాలి. అప్పుడు విజయం నిజంగానే మీది అవుతుంది. 

 

IHG

 

మన విజయానికి మొదటి మెట్టు బలమైన కోరిక. ఇంకా అలాంటి బలమైన కోరికతో పాటు మనం శ్రమించాల్సి ఉంటుంది. మన కోరిక ఎంత పెద్దది అవుతే అంత ఎక్కువ శ్రమించాలి. శ్రమిస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడుతూ ప్రయత్నాలు చేస్తూ.. ఓడిపోయినా మళ్లీ మళ్లీ శ్రమిస్తేనే విజయం మీ సొంతం అవుతుంది. 

 

IHG

 

అలా కాదు అని.. లక్ష్యం పెట్టుకొని.. ఎలాంటి శ్రమ తీసుకోకుంటే మీకు బూడిదే మిగులుతుంది. అందుకే కష్టపడాలి.. ఫలితాన్ని ఆస్వాదించాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. లేదంటే మీరు ఎప్పటికి విజయం సాధించలేరు.. బలమైన కోరికతో పాటు శ్రమ కూడా ఉండాలి. ఓడిపోయినా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చెయ్యాలి. చివరికి మీకు విజయం సొంతం అవుతుంది. మన బలమైన కోరిక.. శ్రమ నే మనల్నిగెలిపిస్తుంది.                       

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: