నేటి మంచిమాట.. గొప్ప రహస్యం ఏమిటంటే ఆనందంగా పనిచేయడమే! అవును.. ఏ పనిని అయినా ఇష్టంగా చేస్తే ఆ వచ్చే ఆనందమే వేరు. అలా కాకుండా ప్రతి పనిని అబ్బా ఇప్పుడు చెయ్యాలా? ఇప్పుడు ఇది చెయ్యడం అవసరమా? మళ్లీ చూద్దాంలే అని అనుకోని సోమరిగా ఉండడం.. ఒకవేళ చేసిన ఇష్టం లేకుండా ఆ పనిని చెయ్యడం వల్ల పనికి రావాల్సిన ఫలితం ఉండదు. 

 

IHG

 

అందుకే మీకు ఇప్పుడు పని చెయ్యాలి అని అనిపించకపోతే ఆ పనిని వదిలెయ్యండి. మీకు నచ్చిన పని మీరు ఇష్టంగా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది.. చేసినందుకు ఆ పనికి ఫలితం ఉంటుంది. అందుకే ఏ పనిని అయినా ఇష్టంగా చెయ్యాలి. లేకుంటే అసలు ఆ పనే చెయ్యకూడదు. ఇష్టం లేకుండా మొదలు పెట్టి అర్థపర్థం లేకుండా చేస్తే అసలు ఫలితం ఉండదు. 

 

IHG

 

అప్పట్లో పాత సినిమాల్లో కూడా చెప్పారు కదా.. ఆడుతు పాడుతు పనిచేస్తూంటే, అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది అంటూ వచ్చే పాటకు అర్ధం ఈ సామెత. అందుకే ఏ పనినై ఇష్టంగా ఆనందంగా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇష్టంగా పని చేస్తే సమస్యలు ఉండవు. ఇష్టం లేకుండా పని చేస్తే చిన్నది అయినా సరే చాలా కష్టం.             

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: