నేటి మంచిమాట.. మంచి స్నేహితులతో జీవితం మరింత మధురంగా మారుతుంది! చిన్నప్పటి నుండి.. చివరి క్షణాల వరకు మనం ఆనందంగా ఉండేందుకు, మనకు కష్టం వచ్చినప్పుడు తోడు ఉండేది మన స్నేహితులే. జీవితం మరింత అందంగా.. మరింత మధురంగా చేసేది కేవలం మన స్నేహితులే. 

 

IHG

 

తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు అంత రక్థసంబంధం. కానీ స్నేహితుడుకు మనకు ఎలాంటి సంబంధం ఉండదు.. చిన్నప్పటి నుండి కలిసి తిరుగుతాం.. ఆడుతాం.. ఏడిపిస్తామ్.. నవ్వుతాం.. ప్రతి వయసులో స్నేహితులతో కలిసి చిలిపి పనులు చేస్తాం.. ఒకరికొకరు ఎలా కొట్టుకున్న.. వేరే ఎవరైనా వారిని అంటే అసలు ఊరుకోరు. 

 

IHG

 

అందుకే ప్రతి సమయంలో మనకు అంటూ ఒకరు స్నేహితుడు ఉండాలి. మనకు కష్టం వచ్చినప్పుడు వారు.. వారికీ కష్టం వచ్చినప్పుడు మనం సహాయం చేస్తాం. నిజం చెప్పాలి అంటే.. మనకు కష్టం వచ్చినప్పుడు మన బంధువులు కూడా మనల్ని చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు. కానీ స్నేహితులు అలా కాదు.. కష్టం వచ్చింది అంటే సహాయం చేస్తారు. నేను ఉన్నారా నీకు అంటారు. 

 

IHG

 

మనం ఎంత ఎదిగినా.. మనకు ఎంతమంది బంధువులు ఉన్న.. ఎంతమంది పిల్లలు ఉన్న.. స్నేహితుడు అనేవాడు జీవితంలో ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్‌ లేని ఎడారిలాంటిది. బాల్యం నుంచి ఎదిగే క్రమంలో యువతలో తలెత్తే మానసిక ఒత్తిళ్లకు స్నేహం అవసరం ఎంతో ఉంది. అమ్మా, నాన్నా లేని వాళ్ళు అనాధలు కాదు నిజమైన స్నేహితులు లేని వాళ్ళు అనాధలు అని తెలుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: