నేటి మంచిమాట.. కీర్తి కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడితే మిగిలేది దుఃఖం! అవును.. మంచి పేరు కావాలని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మీ ఖజానా ఖాళీ అయ్యి మీరు పేదవాళ్ళగా మిగలడం తప్ప మంచి పేరు ఎం రాదూ. మీరు నిజంగా మంచివారు అయితే విచ్చలవిడిగా ఖర్చు పెట్టకపోయినా మంచిపేరు సంపాదిస్తారు. 

 

అయినా అనవసరంగా డబ్బు ఖర్చు చెయ్యడం వల్ల మంచి పేరు ఎప్పుడు రాదు. అలాగే నువ్వు ఉన్నవాడు అని కూడా అనుకోరు. పెడుతున్నాడు కదా! దొరికినంత దోచుకుందాం అనే అనుకుంటారు అంత. అలాగే నువ్వు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పుడు ఎలా అయితే అంత నీతో ఉంటారో నువ్వు పేదవాడివి అయినప్పుడు నిన్ను అందరూ వదిలి వెళ్తారు. 

 

అందుకే నీకు మంచితనం ఉంటే నీకు డబ్బు ఉన్నప్పుడు ఎవరైతే నీతో ఉంటారో నీకు నష్టం వచ్చినప్పుడు నీతో ఏమి లేనప్పుడు కూడా నీకు దైర్యం చెప్తూ నీతోనే ఉంటారు. అందుకే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం బదులు నీతో ఉన్న డబ్బును ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఖర్చు పెట్టు. విచ్చలవిడిగా పార్టీల కోసం ఖర్చు పెట్టిన డబ్బును ఎవరు గుర్తు పెట్టుకోరు. కష్టం వచ్చినప్పుడు సాయం చేసిన డబ్బునే అందరూ గుర్తు పెట్టుకుంటారు. 

 

నీ మంచితనమే నీకు సుఖాన్ని ఇస్తుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఎప్పటికి దుఃఖం ఏ ఇస్తుంది. ఇది గుర్తు పెట్టుకొని డబ్బును ఉపయోగిస్తే జీవితం అద్భుతంగా.. అందంగా ఉంటుంది. లేదు అంటే జీవితం అంత అంధకారమే మిగులుతుంది. చూసుకొని ఖర్చుపెట్టండి. జీవితాన్ని ఆనందంగా గడపండి.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: