నేటి మంచిమాట.. జీవితం అద్భుతంగా ఉండాలంటే క్రమశిక్షణ తప్పదా!? ఇది నిజమే.. ఇన్నాళ్లు తొక్కలో క్రమశిక్షణ.. వీళ్ళు చెప్తే మనం చెయ్యాలా? చెయ్యకపోతే ఎం అవుతుందో చూద్దాం.. అయినా ఎవరో పెట్టిన రూల్స్ నేను పాటించాలా అని అనుకున్నవారికి.. అవి పాటించకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయి అనేది జరిగాకే తెలుస్తుంది. 

 

క్రమశిక్షణ లేని జీవితం దారం తెగిన గాలిపటం అనేది దారం తెగకానీ మనిషికి అర్థం కాదు. క్రమశిక్షణతో ఉంటే నిన్ను ఎవరైనా గౌరవిస్తారు.. ఎవరైనా ప్రేమిస్తారు.. ఎవరైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి అనుకుంటారు. కానీ క్రమశిక్షణ లేకపోతే.. ఆ వారికీ పని వచ్చు కానీ బద్ధకం సార్.. అలాంటి వాళ్ళని మనం భరించలేం సార్ అని చెప్పేస్తారు.          

 

IHG

 

అందుకే కాస్త కఠినం అయినా క్రమశిక్షణతో బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడే జీవితం అద్భుతంగా ఉంటుంది. క్రమశిక్షణ లేని జీవితంలో కష్టాలు.. టెన్షన్లు తప్పవు. ఒకస్థాయి వచ్చేవరకు మిగితా వారు అన్న మాటలు పడాల్సిందే. పడకుండా నువ్వు ఎంత ? నీ తొక్కలో రూల్స్ ఎంత అని మనం అనుకుంటే మన జీవితం చాలా దారుణంగా ఉంటుంది. అందుకే మనకు క్రమశిక్షణ అవసరం లేకపోయినా మన జీవితానికి క్రమశిక్షణ అవసరం. 

 

నీకు క్రమశిక్షణ లేకపోతే రూపాయి సంపాదించలేని వెధవకి కూడా నువ్వు లోకువైపోతావు. అందుకే నీ జీవితం అందంగా.. హుందాగా.. అద్భుతంగా ఉండాలి అంటే.. స్కూల్ కి సమయానికి వెళ్ళాలి.. కాలేజ్ కి సమయానికి వెళ్ళాలి.. ఆఫీస్ కు సమయానికే వెళ్ళాలి.. చెప్పిన పని పూర్తి చెయ్యాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులకంటే మిషన్లకే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: