నేటి మంచిమాట.. ఆకలిగా ఉన్న పేదవారికి అన్నం పెట్టినంత పుణ్యకార్యం మరోటి లేదు! అవును.. మనం ఎవరైనా ఆకలి అని వచ్చిన వారికీ కడుపునిండా అన్నం పెట్టినప్పుడు పుణ్యం కాదు కానీ మనకు ఎంత ఆనందం కల్గుతుంది. మనకు కావాల్సిన వారికీ కోట్లు ఇచ్చిన ఆ ఆనందం కలగదు. కానీ పేదవారికి కడుపునిండా అన్నం పెడితే చాలు ఆనందం కల్గుతుంది. 

 

అందుకే భోజనం సమయానికి శత్రువు ఇంటికి వచ్చిన కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలి అని పెద్దలు చెప్తుంటారు. భోజనం పెట్టడం అనేది అంత మంచి పని. అందుకే ఆకలితో ఉన్నవారు పేదవారు అయినా.. శత్రువులు అయినా మనం వారికీ కడుపు నిండా భోజనం పెడితే దానికంటే మంచి కార్యం మరొకటి ఉండదు. 

 

అందుకే మన ఇంటికి ఎవరు వచ్చిన తిందు రండి అని పిలవాలి. అలా పిలవడం మన సంప్రదాయం. పిలిచి భోజనం పెట్టడం మన మంచితనం. ఇంకా మీరు మర్యాదరామన్న సినిమా చూసి ఉంటారు.. ఆ సినిమాలో శత్రువుకు కూడా భోజనాన్ని ఎంతో ప్రేమగా వడ్డిస్తారు. మనం బ్రతికుండేదే భోజనం తిని.. ఇంకా అలాంటి భోజనాన్ని మరొకరికి పెడితే ఎంత తృప్తి ఉంటుంది. 

 

అన్ని దానాలలో అన్నదానం ఎంతో గొప్పది అని.. ఏ దానం చేసిన అంటే డబ్బు దానం చేసిన.. బియ్యం దానం చేసిన.. ఆస్తులు ఇచ్చిన ఇంకా ఇంకా కావాలి అని అంటారు. కానీ భోజనం మాత్రమే చాలు అమ్మ అంటారు. అందుకే తృప్తిని ఇచ్చేది కేవలం అన్నదానం మాత్రమే.. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టు ఆనందంగా జీవించు.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: