ప్రతి మనిషి పుట్టుక ఒకేలా ఉంటుంది.కొందరు జరిగే ప్రతీ సంఘటననూ సమస్యగా భావించి తలమునకలవుతారు.కొందరు మాత్రమే జరుగుతున్న ప్రతీ సంఘటననూ ఒక అనుభవంగా మార్చుకోగలుగుతారు .మనిషి జీవితకాలంలో కష్టాలూ-సుఖాలూ ఎదుర్కొంటూనే ఉంటాడు.ఎదుర్కునేకొద్ది జీవితం గడపడానికి సులభమవుతుంది. కష్టంతోనే సుఖాన్ని పొందవచ్చని అవగతం చేసుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతే జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలడు. 

 

- జీవితం మనోహరమైన పుష్పం అయితే ప్రేమ అందులో నిరంతరం స్రవించే మధురమైన మకరందం వంటిది. ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. 

 

- ప్రేమించడం సులభం..ప్రేమించబడడం కష్టం...నమ్మడం సులభం..నమ్మించడం కష్టం...గుర్తుంచుకోవడం సులభం..మరచి పోవడం కష్టం....అసత్యమాడడం సులభం..నిజం ఒప్పుకోవడం కష్టం... ఏడిపించడం సులభం..నవ్వించడం కష్టం..

 

- పరిపూర్ణంగా నిన్ను నువ్వు ఎరిగినప్పుడే నీ మనస్సుకు,శాంతి,సుఖం.అప్పుడు ఎలాంటి భాద,అసంతృప్తి,ఆందోళన,ఒత్తిడి,అన్నది నీ దరి చేరవు.చిత్రమేమిటంటే మనం తెలుసుకోవాల్సిన దాని గురించి మనం తగినంత శ్రద్ధ పెట్టం.ఇతరులకు తెలియనివాటి గురించి ఎక్కువుగా ఆలోచిస్తాం,మాట్లాడతాం.కాబట్టి ఇలా మాట్లాడి కాలం వృధా చేసేవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు.

 

- కష్టాలు ఏడ్చినా పోవు – సుఖాలు నవ్వినా రావు!....అలవాటైతే కష్టాలే సుఖాలౌతాయి – అధికమైతే సుఖాలే కష్టాల్లాఉంటాయి !!


- నోటంట వెలువడే ప్రతి పలుకు అర్ధవంతంగా ఉంటూ, కోపావేషాలకు తావివ్వకుండా , పరిణితి చెందిన అలోచాన విధానానికి సర్వసమత్వ భావనలకు కేంద్రంగా ఉంటూ మంచి మనస్సుతో అపకారికి సైతం ఉపకారం చేయాలన్న గుణం నీకు కలిగివుంటే దేవుడు తప్పక నీకు మేలే చేస్తడుగాని కీడు చెయ్యడు.

మరింత సమాచారం తెలుసుకోండి: