నేటి మంచిమాట.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నైజం మంచిది కాదు! మనం ఎదుగుతున్నాం.. అందుకే మరొకరికి మంచి అవకాశం కల్పిస్తాం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎదగాలి కానీ.. అవకాశాన్ని ఇచ్చినవాడినే తొక్కేసి ఎదగడం మంచిది కాదు. కానీ ఈ కాలంలో అలాంటి వారే ఎక్కువగా ఉన్నారు. 

 

మనకు మంచి చేసిన వ్యక్తుల గురించి.. మనకు అన్నం పెట్టిన వ్యక్తుల గురించి.. మనల్ని ఆదుకున్న వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తేనే అంటారు.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు అని. ఇటీవలే ఓ ఘటన జరిగింది.. ఓ సంస్ద మంచి ఉద్యోగం ఇచ్చింది. 

 

ఆ ఉద్యోగానికి తగ్గ పని కూడా వారికి రాదు. కానీ వారికీ అవకాశం ఇచ్చింది. మంచి జీతం ఇస్తూ వచ్చింది. ఉద్యోగం చేసే కొద్ది అన్ని తప్పులు చేస్తూ వచ్చారు.. ఇలానే ఉంటే చాలా కష్టం అని వారించుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు వారి తప్పులను మన్నించారు. చివరికి.. ఎంతో ప్రశాంతంగా ఉండే ఉన్నతాధికారికి కోపం వచ్చింది. 

 

ఇక మీ సేవలు మాకు ఒద్దు అని దండం పెట్టేశారు. సరే.. నీ ఉద్యోగం తీసేశారు.. నీకు స్కిల్స్ ఉంటే మరొకటి వెతుక్కో. ఇప్పుడు నీ ఉద్యోగం తీసేసినా నువ్వు మంచిగా మారి.. సంస్దకు తగ్గట్టు అవుతే నిన్ను మళ్లీ తీసుకుంటారు. నువ్వు అన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించే మనసు ఆ ఉన్నతాధికారికి ఉంది. 

 

ఈ విషయం నీకు తెలుసు.. అలాంటి వ్యక్తి, సంస్థ గురించి తప్పుగా మాట్లాడటం ఎంత తప్పు? నీకు అన్నం పెట్టిన సంస్థ గురించి నువ్వు తప్పుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇలాంటివి చేసేవారినే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం అని అనేది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నైజం మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సమస్యలు తప్పవు..  

మరింత సమాచారం తెలుసుకోండి: