కొంతమంది స్త్రీలు తాము పిల్లలకి పాలు ఇస్తున్నంతకాలం తమకి గర్బం రాదని ధీమాగా ఉంటారు. వాళ్ల ధీమాకి ఫలనా తల్లులు తమపిల్లలకి పాలు ఇస్తున్నంతకాలం గర్భవతులు కాలేదని సాక్షాలు చూపిస్తూ వుంటారు. గర్భం రాకుండా చేసుకునే సులువైన పద్దతిగా భావిస్తారు. బిడ్డ పుట్టిన మొదటి నెలల్లో పాలు తయారవడానికి కావలసిన హార్మోనులు ఎక్కువ మోతాదులో ఉండబట్టి అండం విడుదల కాకపోవచ్చు. అయితే కొద్ది నెలల్లోనే ఆ హార్మోను ప్రభావం తగ్గిపోయి అండం విడుదల మామూలుగా జరుగుతుంది. అటువంటప్పుడు స్త్ర్రీ బిడ్డకు పాలిస్తున్నా గర్భంరావచ్చు. అందుకని బిడ్డకుపాలు ఇవ్వడం, గర్భం రాకుండా రక్షణ అనుకునే సూత్రం అన్ని వేళలా అందరిస్త్రీలలో ఒకేలాగా ఉంటుందని భావించడం పొరబాటు మాత్రమే. భార్య చనుపాలు భర్తకి విషమా ?  రతిసమయంలో భర్త భార్యని ప్రేరేపించ్డానికి చనుమొనలను మృదువుగా స్పర్శించడం జరుగుతుంది. బిడ్డకు పాలు ఇస్తున్న స్త్రీని పురుషుడు చేతి వ్రేళ్ళతోగాని, పెదవులు గాని చనుమొనలు అదిమినట్లయితే పాలు వెలవడడం జరుగుతుంది. నోటితో చనుమొనలను ప్రేరణ చేసినప్పుడు నోట్లోకి పాలు వెళ్ళడం, మింగేయడం జరగవచ్చు. ఈ రకంగా చనుపాలు త్రాగడం జరిగితే భర్తకి ప్రమాదం జరుగుతుందనే అభిప్రాయం వుంది. ఏ పాలు అయితే భర్త నోట్లోకి వెళ్ళాయో అవే పాలు బిడ్డతాగడం జరుగుతుంది. బిడ్డకి ఎవరైనా మూర్ఖులు బిడ్డ తాగవలసిన పాలు తామే తాగివేస్తారేమోనని పెద్దలు ఇటువంటి భయాన్ని కలిగించి ఉంటారు. అదేవిధంగా భర్త పళ్ళు తగిలితే పాలు ఇస్తున్న తల్లి చనుమొనలు విషతుల్యంగా మారుతాయని, బిడ్డకు పాలులేకుండా అయిపోతాయని చెప్పే మాటలుకూడా ఒక రకంగా భయాన్ని కలిగించడానికే, కాని రతిలో భర్త భార్యని ప్రేరేపించే సమయంలో పాలు వెలువడినా, నోట్లోకిపోయినా ఎటువంటి ప్రమాదంలేదు. పైగా దంపతులిద్దరికీ సంయోగంలో సమానంగా తృప్తి కలుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: