సాధారణంగా పురుషులలో సంతాన సంబంధ సమస్యలేమయినా ఉన్నట్టయితే శృంగార పరమైన సమస్యలు ముందుగా కనిపిస్తాయని భావిస్తారు చాలా మంది. కానీ శృంగారపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకపోయినా వీర్యకణాల సంఖ్య తగినంత లేకపోయినా, వాటిలో కదలికలు సరిగా లేకపోయినా సంతాన లేమికి కారణం కావచ్చు. వీర్యకణాలలో కదలికలు తక్కువగా ఉండడాన్ని ఆస్టినోస్పెర్మియా అంటారు. వీర్యకణాలలో చురుకుగా ఉండే కణాలు కనీసం 50 శాతమైనా ఉండాలి. వీర్యకణాలు మూడు రకాలుగా ఉంటాయి. చురుకుగా ఉండేవి కొన్ని , తక్కువ కదలికలు కలిగినవి కొన్ని, అసలు కదలికలు లేనివి కొన్ని కణాలు ఉంటాయి.  కారణాలు : - వీర్యంలో వీర్యకణాల కదలికలలో లోపాలకు అనేక కారణాల వల్ల ఏర్పడతాయి. - వెరికోసిల్ : వృషణాలలో వెరికోసిల్ ఉండడం వల్ల వీర్యకణాలలో కదలికలలో 70 శాతం వరకు లోపాలు ఏర్పడతాయి. - సుఖ వ్యాధుల వల్ల ముఖ్యంగా గనేరియా, క్లామిడియా ఇన్ ఫిక్షన్స్ వల్ల వీర్య కణాలలో లోపాలు ఏర్పడతాయి - శృంగార సమయంలో ఉపయోగించే లూబ్రికెంట్స్ వల్లకూడా వీర్యకణాలలో కదలికలు తగ్గిపోయే అవకాశాలున్నాయి. - వీర్య కణాలలో ఎక్కువగా నిర్జీవ కణాలు ఉండటాన్ని నెక్రూస్సెర్మియా అంటారు. ఈ సమస్య ఉన్నపుడు కూడా వీర్య కణాలలో కదలికలు లోపిస్తాయి. - శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉన్న వారిలో కూడా వీర్య కణాలలో కదలికలు తక్కువగా ఉంటాయి. - వృషణాలకు దెబ్బలు తగలడం వల్ల, మెలితిరగడం వల్ల వీర్య కణాల కదలికలు తగ్గుతాయి. - పోషకాహార లోపం వల్ల ముఖ్యంగా జింక్ లోపం ఏర్పడినపుడు కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. - మద్యపానం, పొగతాగడం వంటి దురలవాట్లు కూడా వీర్య కణాలల కదలికలు నెమ్మదించడానికి కారణమవుతుంది. - కొన్ని రకాల మందులు వాడడం వల్ల ఏర్పడే దుష్రృభాలలో భాగంగా ఈ సమస్య రావచ్చు. వ్యాధి నిర్ధారణ ఈ సమస్యను నిర్ధారించడానికి వీర్య పరీక్ష, హార్మోన్ల పరీక్షలు, స్ర్కోటల్ డాప్లర్ స్టడి వంటి పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఆయుర్వేద చికిత్స పురుషులలో సంతానలేమికి ముక్యంగా వీర్యకణాల సంఖ్యతగ్గడం , వీర్య కణాలు లేకపోవడం, లేదా కదలికలు తక్కువగా ఉండడం వంటివి ముఖ్య కారణాలు. ఈ సమస్యలకు ఎలాంటి దుష్ర్పభావాలు లేని ఆయుర్వేద చికిత్సలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సంతాన లేమి, శృంగారపరమైన సమస్యలకు ఆయుర్వేదంలో వాజికరణ ఔషధాలు అద్భుతమైన ఫలితాను ఇస్తాయి. వెరికోసిల్ గ్రేడ్ -1, గ్రేడ్ -2 ఉన్న వారికి ఆయుర్వేద ఔషధాల ద్వారా సమస్యను తగ్గించవచ్చు. ఆయుర్వేద ఔషధాలు శారీరక, మానసిక వ్యవస్థ మొత్తాన్ని ఆరోగ్యకరంగా చేస్తాయి కనుక ఫలితం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కానీ సంతానలేమి, శృంగారపరమైన సమస్యలకు నిపుణులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: