బహిష్టు సమయంలో సెక్స్ లో పాల్గొ్ంటే వ్యాధులు వస్తాయని అనుకుంటారు. కాని అది నిజం కాదు. కుష్టువ్యాధి రావడానికి మైకోబాక్టీరయమ్ లేప్రే అనే బాక్టీరియా క్రిమి కారణం. ఆ బాక్టీరియా క్రిములు స్త్రీ బహిష్టు స్రావంలో ఉండనే ఉండవు. అందుకని బహిష్టులో ఉన్న స్త్రీతో పాల్గొంటే వ్యాధులు వస్తాయనేది నిజం కాదు. దంపలిద్దరికీ ఇష్టంగా ఉంటే స్త్రీకి బహిష్టుస్రావం అవుతున్నా మామూలుగా సెక్స్ లో పాల్గొనవచ్చు. ఎటువంటి అనారోగ్యంగాని, హాని కాని కలగవు. కొందరిస్త్రీలకు బహిష్టుకి ఒకటి రెండు రోజుల ముందు నుండి సెక్స్ కోరిక ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ రోజుల్లోనే సెక్స్ లో ఎక్కువ థ్రిల్ ని పొందటం జరుగుతుంది.  దీనికి కారణం మెన్సస్ సమయంలో మర్మావయాల దగ్గర రక్తాధిక్యత పంపొంది ఒక విధమైన సలపరం కలుగుతుంది. ఆ సలపరమే వారిలో సెక్స్ కోరికలను మరింత పెంచుతాయి. సెక్స్ లో పాల్గొన్నప్పుడు యోని దగ్గర కండరాలు కొంత సా్పజంకి లోనై తాత్కాలికంగా రక్తాధిక్యతను తగ్గించి హాయిని కలిగిస్తాయి. అందుకనే కొంతమంది స్త్రీలు మెన్సస్ టైమ్ లో రోజుకి మూడు- నాలుగు సార్లు సెక్స్ కావాలని కోరుకుంటారు. మెన్సస్ సమయంలో సెక్స్ పట్ల స్త్రీకి ఆనందం కలుగుతుంటే భర్త ఆమె కోరిక మేరకు రతిలో పాల్గొనడం మంచిదే. దాని వల్ల ఎటువంటి నష్టం కలగదు. అయితే కొందరు స్త్రీలకు బహిష్టులో ఉన్నప్పుడు మనసు చికాకుగా ఉంటుంది. కడుపులో నొప్పి అనిపిస్తుంది. విశ్రాంతిగా పడుకోవాలని మనసు కోరుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో భర్త తన కోరిక తీర్చుకోవాలనుకోవడం కరెక్టుకాదు. మెన్సస్ లో ఉన్న సమయంలో  రతిలో పాల్గొంటే  కొందరు పురుషులకి మూత్రంలో కొంత మంట అనిపించవచ్చు. ఆ మంట తాత్కాలికమైనదే. బహిష్టు స్రావంలోని రసాయనిక పరిస్థితి మూత్రనాళంలో కాస్తమంట కలిగించవచ్చు. కాని అది ఎటువంటి వ్యాధికి దారి తీయదు. అదే విధంగా మెన్సస్ లో ఉండగా రతిలో పాల్గొన్న స్త్రీకి ఆ తరువాత మూత్ర విసర్జన సమయంలో ఒకటి రెండు సార్లు మంట అనిపించవచ్చు. అదేమి నష్టం చేయదు.

మరింత సమాచారం తెలుసుకోండి: