ప్రస్తుత బిజీ జీవితంలో ప్రతి దశలోనూ ఒకటే ఒత్తిడి. దీని ప్రభావంతో ఆడవారిలో మోనాపాజ్ లాగే మగవారిలో ఆండ్రోపాజ్ ఏర్పడి వారి సెక్స్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. తగ్గిన సెక్స్ శక్తిని ఉల్లి, వెల్లుల్లి, మునగవంటివి పెంచుతాయి. ఇత్తిడి తగ్గించుకోవడం, వేళకు భోజనం, తగినంత నిద్ర మొదలైన నియమాలు పాటించడమూ మేలు చూస్తుంది. మోనాపాజ్ అనగానే అందరికి అర్థమవుంతుంది. మోనాపాజ్ కి చేరినవారి గురించి వయసులో వున్నవారు జోక్ లు వేస్తువుంటారు. జాలినిచూపుతుంటారు. మోనోపాజ్ అనేది ఆడవారికి మాత్రమే వర్తించే ఇబ్బంది అని అనుకునేవారు లేకపోలేదు. కాని తాజాగా లభిస్తున్న వైద్యనిపుణుల సమాచారం మోనోపాజ్ అనేదానికి ఆడ, మగ అనే తేడా లేదంటున్నారు. మనిషి జీవితాన్ని నాలుగు దశలుగా విభజించారు. వీటిలో అందరూ చిరస్థాయిగా వుండాలని కోరుకునే దశ యవ్వనదశ, లైంగికపరంగా ఎంతో ఆనందించటానికి అవకాశం ఉన్న వయసు ఇది. ఒక వయసు రాగానే క్రమంగా శరీరంలో సెక్స్ పరమయిన మార్పులు వస్తాయి. ఈ మార్పులు స్త్రీలలో మరింత స్పష్టంగా వుంటాయి. పురుషులలో అంత స్పష్టంగా కనిపించవు. అందువల్ల మోనోపాజ్ సమస్య తమకు లేదని మగవారు. అనుకునేవారు. ఆడవారిలో 35 నుండి 45 సంవత్సారాల వయసులో ఎప్పుడైనా మెనోపాజ్ కనిపించవచ్చు. స్త్రీలలో రుతు చక్రం ఆగిపోవటం మెనోపాజ్ లక్షణం. ఫలితంగా పిల్లల్నికనే శక్తి పోతుంది. శరీరంలో బిగుతు తగ్గుతుంది. వక్షోజాలు కిందికివాలుతాయి.  చర్మంలో మార్పులు వస్తాయి. సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. సెక్స్ లో పాల్గొనటంలో ఇబ్బంది వుంటుంది. హార్మోన్లు ఉత్పత్తిలోవచ్చే తేడాలతో పెదవుల మీద మీసాలవలే మొలవటం, జుట్టు ఊడిపోయి పలచబడటం వంటివన్ని మెనోపాజ్ లక్షణాలే. వీటితోపాటుగా ఎముకల బలహీనత ఏర్పడుతుంది. సులభంగా ఎముకలు విరుగుతాయి. మొత్తం మీద ఆడవారిలో ఆకర్షణ తగ్గిపోతుంది. ఐతే ఇలాంటి సెక్స్పరమై,న మార్పులు మగవారిలో కనపడవు, మగవారిలో డెబ్బే ఏళ్లు వచ్చేవరకు సెక్స్ పటుత్వం తగ్గని సందర్బాలున్నాయి.  రిటైర్ మెంట్ వయసులో తండ్రులు అయన వారున్నారు. కాబట్టి మగవాళ్లకు మెనోపాజ్ సమస్యలు లేనేలేవని నమ్మేవారు. ప్రకృతి స్త్రీ పురుషుల బేదం లేదు. ఒక వయసువరకు సంతానం పొందే శక్తిని ఇద్దరికీ ఇచ్చింది. అదేవిధంగా ఆ శక్తి తగ్గిపోయే వయసు ఇద్దరీ నిర్థారించబడింది ఒకటి రెండు సంవత్సరాల తేడాతో,, కానీ స్త్రీల శరీరం మరోజీవికి జన్మనిచ్చేందుకు వీలుగా రూపొందించబడటంతో ఆమె శరీరం మీద అధ్యయనం అధికంగా సాగింది. కాబట్టి స్త్రీ వైద్యనిపుణులు మనకు కనిపించినంతగా పురుషవైద్యనిపుణులు కనిపించరు. వైద్యశాస్త్రంలో గైనాకాలజీ విబాగం ఎప్పటి నుండోవుంటే, మగవారి సెక్స్ అంగాలకు సంబంధించిన విభాగం ఆండ్రాలజీ ఆలస్యంగా మొదలైంది. ఈ ఆండ్రాలజీ వారు ఇఫ్పడు ఆడవారికి మెనోపాజ్ ఉన్నట్లే మగవారికి వుందని అయితే దానిని మెనోపాజ్ అనక ఆండ్రోపాజ్ అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: